బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా (Urvashi Rautela) లండన్ పర్యటనలో షాకింగ్ అనుభవం ఎదుర్కొన్నారు. వింబుల్డన్ టోర్నీకి హాజరై భారత్ తిరుగు ప్రయాణంలో ఆమె గాట్‌విక్ ఎయిర్‌పోర్ట్‌లో లగ్జరీ సూట్‌కేస్ చోరీ (Luxury suitcase stolen at Gatwick Airport)కి గురైంది.ఆ సూట్‌కేస్‌లో సుమారు రూ.70 లక్షల విలువైన ఆభరణాలు ఉన్నాయని ఊర్వశి తెలిపారు. విలువైన వస్తువులు పోయిన విషయాన్ని ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఆ పోస్టులో ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్, వింబుల్డన్ అధికారులను కూడా ట్యాగ్ చేశారు.

పోలీసులకు ఫిర్యాదు చేసిన ఊర్వశి
ఈ ఘటనపై ఆమె స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే విమానాశ్రయ సిబ్బంది నుంచి తగిన సహాయం అందలేదని వాపోయారు. గాట్‌విక్ ఎయిర్‌పోర్ట్ వర్గాలు ఇంకా స్పందించలేదని కూడా పేర్కొన్నారు.ఊర్వశి రౌతేలా ఇలాంటి చేదు అనుభవం ఇదే తొలిసారి కాదు. 2023లో కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ సమయంలో ఆమె రూ.45 లక్షల విలువైన చెవిపోగు పోగొట్టుకున్నారు. అదేకాక, గతంలో ఆమె ఐఫోన్ కూడా చోరీకి గురైనట్లు స్వయంగా వెల్లడించారు.
వింబుల్డన్ ఫైనల్‌కు హాజరు
ఈ నెల ప్రారంభంలో లండన్‌లో జరిగిన వింబుల్డన్ ఛాంపియన్‌షిప్ 2025 మహిళల సింగిల్స్ ఫైనల్‌కు ఊర్వశి హాజరయ్యారు. ఈ ప్రయాణం ముగించుకుని భారత్ తిరుగుప్రయాణంలో ఉన్నప్పుడు ఈ సంఘటన జరిగింది.ఊర్వశి పోస్ట్ చూసిన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. త్వరగా ఆమె ఆభరణాలు దొరకాలని ఆకాంక్షిస్తున్నారు. సోషల్ మీడియాలో నెటిజన్లు ఎయిర్‌పోర్ట్ భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.
Read Also : Supreme Court : సినీ నటుడు మోహన్ బాబు, మంచు విష్ణులకు సుప్రీంకోర్టులో ఊరట