JEE Main Results Released

జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదల

సత్తాచాటిన తెలుగు విద్యార్థులు..

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎదురుచూస్తోన్న జేఈఈ (మెయిన్) ఫలితాలు ఫిబ్రవరి 11న విడుదలయ్యాయి. జేఈఈ మెయిన్ మొదటి విడత పరీక్షలో విద్యార్థులు సాధించిన పర్సంటైల్ స్కోరును నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో బీఈ/బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలకు దేశవ్యాప్తంగా జనవరి 22, 23, 24, 28, 29 తేదీల్లో పేపర్-1 పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. విద్యార్థులు తమ అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్‌తో పాటు క్యాప్చా కోడ్ వివరాలు నమోదుచేసి స్కోర్‌కార్డు డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

image

జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సత్తాచాటారు. జేఈఈ మెయిన్ పరీక్షలకు దేశ వ్యాప్తంగా 13,11,544 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా.. 12,58,136 మంది హాజరయ్యారు. ఫిబ్రవరి 11న విడుదల చేసిన ఫలితాల్లో మొత్తం 14 మంది విద్యార్థులు 100 పర్సంటైల్‌తో రాణించారు. వీరిలో ఏపీ నుంచి సాయి మనోజ్ఞ గుత్తికొండ 10వ ర్యాంకులో, తెలంగాణకు చెందిన బాని బ్రత మాజీ 12వ ర్యాంకులో నిలిచారు. జేఈఈ (మెయిన్) పేపర్-2 (బీఆర్క్‌/బి ప్లానింగ్‌) ఫలితాలను తర్వాత ప్రకటించనున్నట్లు ఎన్టీఏ వెల్లడించింది.

కాగా, జేఈఈ మెయిన్ సెషన్-2 దరఖాస్తు ప్రక్రియ ఇఫ్పటికే ప్రారంభంకాగా.. ఫిబ్రవరి 25 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. ఏప్రిల్‌ 1 నుంచి 8 వరకు జేఈఈ మెయిన్‌ రెండో విడత పరీక్షలు నిర్వహించనున్నారు. మొదటి విడత పరీక్షలు రాసినవారు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మొదటి దశ పరీక్షలో సాధించిన స్కోరుతో సంతృప్తి చెందని వారు రెండో విడత పరీక్షలు రాస్తుంటారు. ఈ రెండింటిలో ఉత్తమ స్కోరును పరిగణనలోకి తీసుకొని విద్యార్థులకు ర్యాంకులు కేటాయిస్తారు. ఆ తర్వాత సామాజిక వర్గాల వారీగా రిజర్వేషన్లకు అనుగుణంగా మొత్తం 2.50లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రాసేందుకు అర్హత కల్పిస్తారు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో సత్తా చాటిన విద్యార్థులకు జోసా కౌన్సిలింగ్‌ ద్వారా ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

Related Posts
నేటి నుంచి 5 రోజులు జాగ్రత్త
summer temperature

తెలంగాణ రాష్ట్రంలో నేటి నుంచి వచ్చే ఐదు రోజులు తీవ్ర వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మార్చి 18 వరకు కొన్ని ప్రాంతాల్లో 40 డిగ్రీలకుపైగా Read more

కాసేపట్లో తిరుపతికి సీఎం చంద్రబాబు
Chandrababu's visit to tirupathi from today

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు తిరుపతికి వెళ్లనున్నారు. తిరుచానూరులో సహజవాయువును పైపుల ద్వారా ఇళ్లకు సరఫరా చేసే ప్రాజెక్టును ఆయన ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం రాష్ట్రంలోని పర్యావరణ Read more

గూగుల్ క్లౌడ్ విస్తరణకు ఆంధ్రప్రదేశ్: సీఎం
గూగుల్ క్లౌడ్ విస్తరణకు ఆంధ్రప్రదేశ్: సీఎం

దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యుఇఎఫ్) సదస్సులో ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ ను గూగుల్ క్లౌడ్ వంటి సాంకేతిక సంస్థలకు వ్యూహాత్మక కేంద్రంగా Read more

పెట్రోల్ పంపులో దివ్యాంగులు, ట్రాన్స్ జెండర్లకు ఉపాధి
Employment of Disabled and

రాజన్న సిరిసిల్ల జిల్లాలో దివ్యాంగులు, ట్రాన్స్ జెండర్లకు ఉపాధి కల్పించేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేకంగా ఒక పెట్రోల్ పంపు ఏర్పాటు చేసింది. సిరిసిల్ల రెండో బైపాస్ రోడ్డుపై Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *