JD Vance coming to India soon!

త్వరలో భారత్‌కు రానున్న జేడీ వాన్స్ !

వాషింగ్టన్: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, అమెరికా సెకండ్ లేడీ ఉషా వాన్స్ త్వరలో భారత్‌లో పర్యటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నెలలోనే జేడీ వాన్స్ ఫ్యామిలీ భారత్‌ను సందర్శించనున్నట్లు వర్గాలు పేర్కొన్నాయి. గత నెలలో జేడీ వాన్స్.. ఫ్రాన్స్, జర్మనీలో తొలి విదేశీ పర్యటన చేశారు. రెండో విదేశీ పర్యటన భారత్‌లోనే ఉండనున్నట్లు తెలుస్తోంది.

Advertisements
త్వరలో భారత్‌కు రానున్న జేడీ

మార్చి నెలాఖరుకి భారత్‌లో

ఉషా వాన్స్.. పూర్వీకులది ఆంధ్రప్రదేశ్. ఆమె తల్లిదండ్రులు భారత్ నుంచి అమెరికాకు వెళ్లి స్థిరపడ్డారు. ఉషా వాన్స్.. అమెరికాలో విద్యను అభ్యషించేటప్పుడు జేడీ వాన్స్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే తాజాగా జరిగిన అమెరికా ఎన్నికల్లో విజయం సాధించడంతో అమెరికా ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ బాధ్యతలు చేపట్టారు. మొత్తానికి మార్చి నెలాఖరుకి భారత్‌లో ఈ దంపతులు పర్యటించనున్నట్లు సమాచారం.

అమెరికాలో మార్పు వస్తుందేమో

అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. భారత్‌పై భారీగా సుంకాలు పెంచేశారు. ఏప్రిల్ 2 నుంచి భారత్‌పై సుంకాలు అమలవుతాయిని పేర్కోన్నారు. ఈ నేపథ్యంలో జేడీ వాన్స్.. భారత పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. జేడీ వాన్స్ భారత పర్యటన తర్వాతైన అమెరికాలో మార్పు వస్తుందేమో చూడాలి.

వివిధ అంశాలపై గొప్ప సంభాషణ

ఇటీవల ప్రధాని మోడీ ఫ్రాన్స్ పర్యటన చేశారు. అక్కడ జేడీ వాన్స్ కుటుంబంతో మోడీ భేటీ అయ్యారు. అలాగే జేడీ వాన్స్ పిల్లలకు మోడీ ప్రత్యేకమైన బహుమతులను కూడా అందజేశారు. జేడీ వాన్స్ కుమారుడు వివేక్ పుట్టినరోజు వేడుకల్లో కూడా మోడీ పాల్గొన్నారు. జేడీ వాన్స్ కుటుంబ సభ్యులతో అద్భుతమైన సమావేశం జరిగిందని.. వివిధ అంశాలపై గొప్ప సంభాషణ జరిగిందని మోడీ ఎక్స్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. మోడీకి ట్వీట్‌కు జేడీ వాన్స్ కూడా కృతజ్ఞతలు వ్యక్తం చేశారు.

Related Posts
హైదరాబాద్‌లో ఐదేళ్ల చిన్నారిపై లైంగిక దాడి..
rap 5 years old girl hyd

హైదరాబాద్ నగరంలో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్ 16వ డివిజన్‌లో ఐదేళ్ల చిన్నారిపై లైంగిక దాడి జరిగింది. చాక్లెట్ ఆశ చూపి Read more

ట్రంప్ అధికారంలో ఉక్రెయిన్ యుద్ధం త్వరగా ముగుస్తుంది: జెలెన్స్కీ
trump zelensky

ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ, డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికైతే, ఉక్రెయిన్-రష్యా యుద్ధం త్వరగా ముగిసిపోతుందని ,అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ గెలిచిన తరువాత ఆయనతో Read more

అమెరికా లో భాద్యతలు స్వీకరించిన కాశ్ ప‌టేల్‌.
అమెరికా లో భాద్యతలు స్వీకరించిన కాశ్ ప‌టేల్‌.

అమెరికా దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) కొత్త డైరెక్టర్‌గా భారత సంతతికి చెందిన కాశ్ పటేల్ ప్రమాణ స్వీకారం చేశారు.హిందూ పవిత్ర గ్రంథమైన Read more

Telangana: కేంద్రం, ఏపీ ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు
Supreme Court notices to the Central and AP government

Telangana: కృష్ణానది ప్రాజెక్టులపై కేంద్రం ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కృష్ణా పరీవాహకంలోని ప్రాజెక్టుల నిర్వహణను కృష్ణానదీ యాజమాన్య బోర్డు (KRMB)కి అప్పగించాలని Read more

×