- ప్రతి ఏడాది ఈ వేడుకలు ప్రత్యేకం
జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలను పురస్కరించుకుని, ఆ పార్టీ కీలక ప్రకటన చేసింది. మార్చి 14న జనసేన ఆవిర్భావ వేడుకలను అంగరంగ వైభవంగా జరపాలని నిర్ణయించింది. ఈసారి ఈ వేడుకలను జనసేనాని పవన్ కల్యాణ్ నియోజకవర్గమైన పిఠాపురంలో నిర్వహించనున్నారు. జనసేన పార్టీ ప్రారంభమైనప్పటి నుంచి ప్రతి ఏడాది ఈ వేడుకలు ప్రత్యేకంగా జరుగుతాయి. అయితే, 2024 ఎన్నికల విజయం తర్వాత మొదటిసారిగా జరుపుకుంటున్న వేడుక కావడంతో, పార్టీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ఉన్నాయి.

సాధారణ ఎన్నికల్లో జనసేన పార్టీ 100 శాతం విజయం
ఈ వేడుకలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుందని పార్టీ నేతలు వెల్లడించారు. ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో జనసేన పార్టీ 100 శాతం విజయం సాధించింది. కూటమి ప్రభుత్వ ఏర్పాటులో జనసేన కీలకపాత్ర పోషించడం గమనార్హం. ఘన విజయం సాధించిన తర్వాత జరుగుతున్న మొదటి ఆవిర్భావ సభ కావడంతో, దీనికి పెద్ద ఎత్తున జనసైనికులు హాజరుకానున్నారు. పవన్ కల్యాణ్ సూచనల మేరకు ఈ సభను పిఠాపురంలో నిర్వహించనున్నారు. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఈ సభలో ముఖ్యఅతిథిగా పాల్గొననున్నారు. పార్టీ భవిష్యత్తు కార్యాచరణ, కూటమి ప్రభుత్వ విధానాలపై జనసైనికులకు స్పష్టమైన మార్గదర్శనం ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా నూతన పార్టీ కార్యాలయం ప్రారంభం, నూతన నాయకత్వ ప్రకటనలు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే ప్రత్యేక అతిథుల హాజరు వంటి అంశాలపై జనసేన శ్రేణులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.