Jana Sena avirbhava sabha Poster Released

జనసేన ఆవిర్భావ దినోత్సవ పోస్టర్ విడుదల

అమరావతి: జనసేన ఆవిర్భావ సభ నిర్వహణ కమిటీలతో మంత్రి నాదెండ్ల మనోహర్ సమావేశం నిర్వహించారు. మార్చి 14న పిఠాపురం వేదికగా జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సంబంధించిన పోస్టర్ ను తాజాగా ఆయన రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనసేన పార్టీ రాష్ట్రానికి భవిష్యత్ అని ప్రజలు అనుకునే విధంగా సభ నిర్వహించాలన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విలువలతో కూడిన రాజకీయాలు చేస్తున్నారు. పవన్ వస్తున్నారంటే జనాలను తరలించాల్సిన అవసరం లేదు. జనసేనలో చాలా మంది పదవులను ఆశిస్తున్నారు. పదవుల కోసం జనసేనలో ప్రయాణం చేయకూడదని మంత్రి మనోహర్ సూచించారు.

Advertisements
జనసేన ఆవిర్భావ దినోత్సవ పోస్టర్

పండుగ వాతావరణంలో గర్వంగా సభ

జనసేన తరపున ఇంత మంది ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలుగా ఉంటారు అని అనుకోలేదని నాందెండ్ల మనోహర్ తెలిపారు. పండుగ వాతావరణంలో గర్వంగా సభ జరుపుకోవాలి. పవన్ డిప్యూటీ సీఎం హోదాలో నిర్వహిస్తున్న సభను సక్సెస్ చేయాలని సూచించారు. అధికారం దుర్వినియోగం చేసి వ్యవస్థలను వారి స్వార్థం కోసం వాడుకున్న వాళ్లను చట్టం శిక్షిస్తుందన్నారు. మంత్రి క్షేత్ర స్థాయిలో ఇబ్బంది పడ్డవారు ఇచ్చిన కంప్లైట్ పై ప్రభుత్వం తప్పకుండా స్పందిస్తుందని నాందెండ్ల తెలిపారు.

మార్చి 12, 13, 14 తేదీల్లో పిఠాపురంలో ప్లీనరీ

ఈ చారిత్రాత్మక ఎన్నికల విజయం తర్వాత జరుగుతున్న మొదటి ఆవిర్భావ దినోత్సవ వేడుక ఇది కాబట్టి, ఈ కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు చేయడానికి ప్రణాళికలు వేస్తున్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రతిపాదన మేరకు పిఠాపురంలో ఈ వేడుకలు నిర్వహించాలనే నిర్ణయం తీసుకున్నారు. 3 రోజులపాటు ఈ వేడుకలు నిర్వహించబోతున్నారని తెలుస్తోంది. మార్చి 12, 13, 14 తేదీల్లో పిఠాపురంలో ప్లీనరీ నిర్వహించాలని తీర్మానించారు జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో జనసేన సిద్ధాంతాలు, పవన్‌ కల్యాణ్‌ ఆశయాలు, ప్రజలకు జనసేన చేస్తున్న సేవ గురించి వివరించనున్నారు.

Related Posts
నేడు కేంద్ర మంత్రులతో సీఎం చంద్రబాబు భేటీ
CM Chandrababu meets Union Ministers today

నేడు కేంద్ర మంత్రులతో సీఎం చంద్రబాబు భేటీ.రాష్ట్ర పరిస్థితులపై ఢిల్లీ పెద్దలతో చర్చలు.అమరావతి: బుధవారం రాత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు దేశరాజధాని ఢిల్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు Read more

ఇండస్ట్రీలో సీనియర్ నటుడు మృతి
ఇండస్ట్రీలో సీనియర్ నటుడు మృతి

టాలీవుడ్‌లో దురదృష్టకర సంఘటన చోటుచేసుకుంది. సీనియర్ నటుడు విజయ రంగరాజు మరణ వార్త సినీ ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసింది. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, చెన్నైలోని ప్రభుత్వ Read more

Minister Komatireddy : త్వరలోనే కాళేశ్వరం వాస్తవాలు బయటపెడతాం : మంత్రి కోమటిరెడ్డి
We will soon reveal the facts of Kaleshwaram.. Minister Komatireddy

Minister Komatireddy : ఈరోజు హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వేషన్ సెంటర్‌లో జరుగుతున్న భారత్ సమ్మిట్‌లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ… Read more

Narendra Modi:వారణాసిలో 880 కోట్ల రూపాయలతో 44 ప్రాజెక్టులు ప్రారంభం:ప్రధాని మోదీ
Narendra Modi:వారణాసిలో 880 కోట్ల రూపాయలతో 44 ప్రాజెక్టులు ప్రారంభం:ప్రధాని మోదీ

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసి (కాశీ)లో పర్యటించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,కాశీవాసుల ప్రేమకు రుణపడి ఉన్నానని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ Read more

Advertisements
×