ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన “హరిహర వీరమల్లు” (Harihara Veeramallu ) సినిమా జూలై 24న విడుదల కానున్న సందర్భంగా, విశాఖలో జనసైనికులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంపత్ వినాయకునికి పూజలు చేసి, 108 కొబ్బరికాయలు కొట్టి, సినిమా హిట్ కావాలని ఆకాంక్షించారు. పవన్ కళ్యాణ్ చరిత్ర ఆధారంగా చేసిన సినిమా రాబోతుండటంతో ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నామని అభిమానులు పేర్కొన్నారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కావడం గర్వకారణమని వారు అంటున్నారు.
చరిత్రను తెలిపే విజువల్ గ్రాండియర్
హరిహర వీరమల్లు చిత్రం 17వ శతాబ్దపు మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో రూపొందిన పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ. పవన్ కళ్యాణ్ చారిత్రక యోధుడి పాత్రలో కనిపించనున్న ఈ సినిమాను క్రిష్, జ్యోతికృష్ణలు సంయుక్తంగా దర్శకత్వం వహించారు. మెగా సూర్య ప్రొడక్షన్స్‌పై ఎ.ఎం. రత్నం సమర్పణలో ఎ. దయాకర్ రావు ఈ చిత్రాన్ని నిర్మించారు. సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేయగా, సినిమా రన్ టైమ్ 2 గంటల 42 నిమిషాలుగా ప్రకటించారు. విజువల్ గ్రాండియర్, చక్కటి కథనం, కుటుంబసమేతంగా చూడదగ్గ క్లీన్ కంటెంట్‌తో సినిమా రూపొందిందని యూనిట్ చెబుతోంది.
బుకింగ్ హవా – ప్రీమియర్ షోలు హౌస్‌ఫుల్
ఈ సినిమాకు సంబంధించి టికెట్ బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో డిస్ట్రిక్ట్ యాప్ ద్వారా బుకింగ్స్ లైవ్ కాగా, చాలా ప్రాంతాల్లో SOLD OUTగా మారాయి. జూలై 23 రాత్రి 9 గంటలకు ప్రీమియర్ షోలు ప్రారంభం కానుండగా, టికెట్లకు భారీ డిమాండ్ నెలకొంది. ప్రభుత్వం టికెట్ ధర పెంపుకు ప్రత్యేక అనుమతి ఇవ్వడంతో, పవన్ అభిమానుల్లో మరింత ఉత్సాహం నెలకొంది. రెండు సంవత్సరాల విరామం తర్వాత పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా స్థాయిలో తెరపైకి వస్తున్న ఈ చిత్రంపై టాలీవుడ్ మొత్తం దృష్టి నిలిపింది.
Read Also : Bandh : తెలంగాణ లో ఈరోజు స్కూళ్లు, కాలేజీలు బంద్ – ఎస్ఎఫ్ఎ