Jammu & Kashmir: Six Killed In Massive Fire At DSP's Home In Kathua

కథువాలో అగ్నిప్రమాదం.. ఆరుగురు మృతి

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కథువాలో ఓ ఇంట్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఊపిరాడక ఆరుగురు చనిపోయారు. మ‌రో నలుగురు వ్యక్తులు అపస్మారక స్థితిలో ఉన్నారు. నలుగురిని ఆసుపత్రిలో చేర్చారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. కతువాలోని శివ నగర్‌లో కేశవ్ రైనా (81) కుమారుడు రిటైర్డ్ డీఎస్పీ అవతార్ కృష్ణ ఇంట్లో అర్థరాత్రి అనుమానాస్పద స్థితిలో మంటలు చెలరేగాయి. ఊపిరాడక ఇంట్లో నిద్రిస్తున్న ఆరుగురు మృతి చెందారు. వీరిలో చాలా మంది పిల్లలు ఉన్నారు. కాగా నలుగురు అపస్మారక స్థితిలో ఉన్నట్లు సమాచారం. నలుగురిని ఆసుపత్రిలో చేర్చారు. మృతుల్లో రిటైర్డ్ డీఎస్పీ కూడా ఉన్నారు.

Advertisements

ముగ్గురిని ఇంటి నుంచి రక్షించి ఆస్పత్రికి తరలించారు. అయితే రక్షించే క్రమంలో పొరుగువారికి కూడా గాయాలయ్యాయి. క్షతగాత్రుల పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. జీఎంసీ కథువా ప్రిన్సిపల్ సురీందర్ అత్రి ప్రకారం.. ప్ర‌మాదం కార‌ణంగా ఊపిరాడక మరణించిన‌ట్లు ప్రాథమిక విచార‌ణ‌లో తేలింది. మృతుల్లో నలుగురు మైనర్లు కాగా.. వీరిలో ఇద్దరు మూడు నుంచి నాలుగేళ్ల చిన్నారులు. “రిటైర్డ్ అసిస్టెంట్ మేట్రన్ అద్దె ఇంట్లో మంటలు చెలరేగాయి. 10 మందిలో ఆరుగురు మరణించారు, నలుగురు గాయపడ్డారు. పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. పోస్ట్ మార్టం తర్వాత మృతదేహాలను బయటకు తీస్తారు,” అత్రి చెప్పారు.

కాగా, అగ్ని ప్రమాదం గురించి తెలియగానే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలు ఆర్పివేసే ప్రయత్నం చేశారు. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే ఇంటికి మంటలు అంటుకున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Related Posts
స్విగ్గీ బాయ్ కట్ నిర్ణయం వెనక్కి
swiggy ap

ఏపీలో ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీని బహిష్కరించాలని హోటళ్ల అసోసియేషన్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో కొంతకాలంగా స్విగ్గీతో హోటల్స్ అసోసియేషన్ ఎదుర్కొంటున్న సమస్యల కారణంగా Read more

ఢిల్లీలో కొనసాగుతున్న సీఎం చంద్రబాబు పర్యటన .. కేంద్రమంత్రులతో భేటీ!
CM Chandrababu ongoing visit to Delhi . Meeting with Union Ministers

న్యూఢిల్లీ : ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో బిజీ బిజీగా గడుపుతున్నారు. తన షెడ్యూల్‌లో భాగంగా నేడు పలువురు కేంద్ర మంత్రులతో ఆయన భేటీ కానున్నారు. Read more

దేశ ప్రజలకు కేంద్రం గుడ్ న్యూస్‌
The center is good news for the people of the country

ఉద్యోగుల్లా ప్రతి నెల పింఛన్ వచ్చే పథకానికి రూపకల్పన న్యూఢిల్లీ: ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగం చేస్తున్న వాళ్లకు వచ్చినట్టుగానే 60 ఏళ్లు దాటిన ప్రతి పౌరుడికి Read more

వర్రా రవీందర్‌రెడ్డికి 14 రోజుల రిమాండ్‌
వర్రా రవీందర్‌రెడ్డికి 14 రోజుల రిమాండ్‌

అమరావతి: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్‌రెడ్డికి జగ్గయ్యపేట కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. కడప కేంద్ర కారాగారంలో రిమాండ్‌ ఖైదీగా ఉన్న రవీందర్‌రెడ్డిని Read more

×