Jagan visit to Kadapa district today

నేడు కడప జిల్లాలో జగన్‌ పర్యటన

అమరావతి: నేడు కడప జిల్లాకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రానున్నారు. ఈ మేరకు ఆయన నాలుగు రోజుల పాటు కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఈరోజు ఉదయం 11 గంటలకు ఆయన బెంగళూరు నుంచి ఇడుపులపాయకు చేరుకోనున్నారు. తొలుత ఆయన తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఘాట్ వద్ద నివాళి అర్పిస్తారు. ఆ తర్వాత ప్రేయర్ హాల్ లో జరిగే ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. అనంతరం కడప నియోజకవర్గ నేతలతో సమావేశమవుతారు. మధ్యాహ్నం 3.30 గంటలకు పులివెందులకు బయల్దేరుతారు. రాత్రికి పులివెందులలోని నివాసంలో బస చేస్తారు.

రేపు జగన్ పులివెందులలోని సీఎస్ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొననున్నారు. 26వ తేదీ పులివెందులలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు. 27వ తేదీ ఉదయం 9 గంటలకు పులివెందుల విజయా గార్డెన్స్ లో జరిగే వివాహానికి హాజరవుతారు. ఆ తర్వాత పులివెందుల నుంచి జగన్ బెంగళూరుకు తిరుగుపయనమవుతారు.

Related Posts
సంక్రాంతికి వస్తున్నాం: క్రైమ్ స్టోరీ!
సంక్రాంతికి వస్తున్నాం: క్రైమ్ స్టోరీ!

వరుస హిట్లతో మంచి గుర్తింపు తెచ్చుకున్న తెలుగు దర్శకుడు అనిల్ రావిపూడి 'సంక్రాంతి వస్తున్నాం' అనే సంతోషకరమైన ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ను ప్రేక్షకులకు అందించేందుకు సిద్ధమయ్యారు. వెంకటేష్ ప్రధాన Read more

హోరా హోరీగా అమెరికా ఎన్నికల ఫలితాలు..ట్రంప్‌ 247..హారిస్‌ 214
US Election Result 2024. Donald Trump Inches Towards Victory Is Republicans Win Senate Majority

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితం హోరా హోరీగా మారుతున్నాయి. కౌంటింగ్ జరిగే కొద్దీ ట్రెండ్స్ మారిపోతున్నాయి. మొదటి నుంచి ఆధిక్యతలో ఉన్న ట్రంప్ కు హరీస్ Read more

రైల్వే బడ్జెట్ ఎన్ని కోట్లు అంటే?
రైల్వే బడ్జెట్ ఎన్ని కోట్లు అంటే?

భారతీయ రైల్వేలు దేశం కోసం ఎంతో కీలకమైన వ్యవస్థ. ప్రతి బడ్జెట్‌లో కూడా రైల్వే కోసం పెద్ద ప్రకటనలు వచ్చే ఆశ ఉండేది. కానీ ఈసారి పరిస్థితి Read more

ప్రారంభమైన రంజాన్ మాసం.. ముస్లింలకు నేతల శుభాకాంక్షలు
రంజాన్ ముబారక్! రాజకీయ నేతల నుంచి ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు

ఈ రోజు నుంచి పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమవుతున్న సందర్భంగా ముస్లిం సోదరులకు పలువురు ప్రముఖులు, రాజకీయ నేతలు, విశిష్ట వ్యక్తులు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు Read more