విజయవాడ: మాజీ సిఎం జగన్ (Jagan) డిఐజి స్థాయి అధికారులను మాఫియా డాన్లతో పోల్చడం అత్యంత దారుణమని రాష్ట్ర పోలీసు అధికారుల (Police officers) సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరావు అన్నారు. విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ…ఇలాంటి వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు లాంటివని అన్నారు.

వైఎస్సార్సీ ప్రభుత్వ హయాంలోనూ ఇదే పోలీసులు పనిచేసిన విషయం జగన్ (Jagan) మర్చిపోయారా అని ప్రశ్నించారు. చట్టబద్ధంగా, న్యాయ బద్దంగా విధులు నిర్వహిస్తామన్న శ్రీనివాసరావు (Srinivasa Rao).. అభ్యంతరాలుంటే న్యాయస్థానాలను ఆశ్రయించాలి. కాని, ఇష్టారీతిన ఆరోపణలు చేయడం సమంజసం కాదన్నారు. ఐపిఎస్ సిథార్థ్ కౌశల్ వీఆర్ఎస్ పైన జగన్ చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని స్పష్టం చేశారు. పోలీసుల్ని బెదిరించడం సరికాదన్నారు .
జగన్ ఏ సందర్భంలో పోలీసులపై వ్యాఖ్యలు చేశారు?
ఒక ప్రజా సభలో మాట్లాడిన సందర్భంగా, వైఎస్ జగన్ కొందరు పోలీసు అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, వారిపై తాపత్రయంగా, కఠినంగా స్పందించారని నివేదికలు చెబుతున్నాయి. ఇది పోలీసులను బెదిరించినట్లుగా భావించినట్టు పోలీసు సంఘం అభిప్రాయపడింది.
Read hindi news: hindi.vaartha.com
Read also: High Court: సంక్షేమ హాస్టళ్లపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం
Hyderabad-Vijayawada Highway: హైదరాబాద్-విజయవాడ రహదారి ఆరు లేన్లుగా విస్తరణ