వైసీపీ అధినేత జగన్ ఈరోజు శ్రీసత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గాన్ని సందర్శించారు.ఇటీవల హత్యకు గురైన కార్యకర్త లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించారు.అక్కడి నుంచి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడిన జగన్, పోలీసులపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.“వైసీపీ అధికారంలోకి వస్తే, మీ యూనిఫామ్ లేపేస్తాం.ఉద్యోగాలే లేకుండా చేస్తాం” అంటూ పోలీసులకు గట్టి హెచ్చరిక ఇచ్చారు.”బట్టలూడదీసి కొడతాం” అనే మాటలతో తన ఆవేశాన్ని బయటపెట్టారు. టీడీపీకి జోలపడి వైసీపీ శ్రేణులను భయపెడతారా? అంటూ మండిపడ్డారు.హత్యకు గురైన లింగమయ్య కుటుంబానికి తాను పూర్తిగా అండగా ఉంటానని జగన్ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని చెప్పారు.“ఇక్కడ రాజ్యాంగం కాదు, రెడ్ బుక్ నడుస్తోంది” అంటూ ఆరోపణలు చేశారు.“చాలా చోట్ల టీడీపీ ఓడిపోయింది.50 స్థానాల్లో ఎన్నికలు జరిగితే, 39 చోట్ల వైసీపీ గెలిచింది,” అని జగన్ వివరించారు.

టీడీపీకి బలం లేకపోయినా, అధికార తలంపుతోనే ఎన్నికల్లో నిలుస్తోందని ఎద్దేవా చేశారు.“సీఎంగా ఉన్నాననే అహంకారంతో ఆయన వ్యవహరిస్తున్నారు.పూర్తిగా నియంతలాగా పాలిస్తున్నారు,” అని చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పోలీసులు చేతిలో ఉన్న శక్తిని తమ లాభానికి వాడుకుంటున్నారని మండిపడ్డారు.పినెళ్లి రామకృష్ణారెడ్డిపై కుట్ర పూరితంగా కేసులు పెట్టారని జగన్ విమర్శించారు. నటుడు పోసాని కృష్ణమురళిపై 18 అక్రమ కేసులు బనాయించారని తెలిపారు. నందిగం సురేశ్‌ను 145 రోజులు జైలులో ఉంచారని ఆరోపించారు.“ఇవి అన్నీ టీడీపీ–పోలీసుల కలయికతో జరుగుతున్న కుట్రలు. ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే,” అని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరూ భయపడాల్సిన పని లేదని, నిజం ఎప్పటికీ వెలుగులోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
Read also : YS Jagan: పవన్ కుమారుడి ప్రమాదంపై స్పందించిన జగన్