buddavenkanna

జగన్, విజయసాయి కొత్త డ్రామా – బుద్దా వెంకన్న

రాజకీయాలకు విజయసాయిరెడ్డి గుడ్ బై చెప్పడం జగన్ కు తెలిసే జరిగిందని టీడీపీ నేత బుద్దా వెంకన్న అన్నారు. ‘కేసులను పక్కదారి పట్టించేందుకు ఈ డ్రామా. చంద్రబాబుతో విభేదాలు లేవంటే నమ్మేంత పిచ్చోళ్లు కాదు ప్రజలు. చంద్రబాబు కుటుంబాన్ని నువ్వు అన్న మాటలు మర్చిపోను. నిన్ను క్షమించను. మీరు చేసిన భూ కబ్జాలు, దోపిడీల లెక్క తేలాలి. విజయసాయిరెడ్డి దేశం విడిచి వెళ్లడానికి CBI అనుమతి ఇవ్వకూడదు’ అని ట్వీట్ చేశారు.

చంద్రబాబుతో వ్యక్తిగత విభేదాలు లేవు అంటే నమ్మెంత పిచ్చోళ్లు కాదు ప్రజలు. తమ నాయకుడిపై అన్న ప్రతి మాట మాకు ఇంకా గుర్తు ఉందని పేర్కొన్నారు. చేసినవి అన్ని చేసి ఈ రోజు రాజీనామా చేసి వెళ్లిపోతా అంటే కుదరని అన్నారు. మీరు చేసిన భూ కబ్జాలు, దోపిడీలు ఉత్తరాంధ్రలో చేసిన అరాచకాలు ప్రతి దానికి లెక్క తేలాలని పేర్కొన్నారు. చంద్రబాబును, వారి కుటుంబాన్ని అన్న మాటు ఎవరూ మరిచిపోయినా నేను మర్చిపోను. నువ్వు పెట్టిన ప్రతి ట్వీట్‌కు నేను ఇచ్చిన సమాధానం గుర్తు ఉంది కదా అంటూ ప్రశ్నించారు.

ఇక విజయసాయి రెడ్డి శనివారం రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా అనంతరం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకోవడానికే నిర్ణయం తీసుకున్నానని అన్నారు. నేను ఏరోజూ అబద్ధాలు చెప్పలేదు. హిందూ ధర్మాన్ని నమ్మిన వ్యక్తిగా నేను అబద్ధాలు చెప్పనని వెల్లడించారు.

నాలుగు దశాబ్దాలుగా వైఎస్‌ కుటుంబంతో నాకు సన్నిహిత సంబంధాలున్నాయని, వైఎస్‌ కుటుంబంలో మూడు తరాలతో నాకు సంబంధాలున్నాయని స్పష్టం చేశారు. రాజీనామా పూర్తి వ్యక్తిగతమని అన్నారు. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో రాజ్యసభ సభ్యుడిగా , పార్టీకి న్యాయం చేయలేనని భావించి రాజీనామా చేశానని వివరించారు. నా స్థానంలో మరొక వ్యక్తి వస్తే రాష్ట్రానికి మేలు జరుగుతుందనే నమ్మకంతో ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు.

Related Posts
వెంకీమామ ఏంటి ఈ రికార్డ్స్ …సంక్రాంతి మొత్తం నీదే..!
SKV firstweek

వెంకటేశ్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. ఫామిలీ & యాక్షన్ డ్రామాగా Read more

ఎల్ కె అద్వానీకి అస్వస్థత
LK Advani Indian politician BJP leader India 2015

భారత మాజీ ఉప ప్రధాని, బీజేపీ కురువృద్ధుడు ఎల్ కె అద్వానీ అస్వస్థతకు గురయ్యారు. దీంతో శనివారం ఉదయం అద్వానీని ఆయన కుటుంబ సభ్యులు అపోలో ఆసుపత్రికి Read more

AP Cabinet : రేపు అమరావతి పనులకు పచ్చ జెండా ఊపనున్న కేబినెట్
AP Cabinet రేపు అమరావతి పనులకు పచ్చ జెండా ఊపనున్న కేబినెట్

AP Cabinet : రేపు అమరావతి పనులకు పచ్చ జెండా ఊపనున్న కేబినెట్ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రేపు రాష్ట్ర కేబినెట్ సమావేశం Read more

ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
Fatal road accident. Six killed

డెహ్రాడూన్‌ : ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్‌లో ఈరోజు (మంగళవారం) తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. దీంతో ఆరుగురు అక్కడిక్కడే మృతి చెందారు. అలాగే మరో వ్యక్తికి Read more