వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala) ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో పార్టీ ఓటమిపై స్పందించారు. “ఇంత మంచి పాలన చేసిన తర్వాత కూడా ప్రజలు మమ్మల్ని తిరస్కరించడం పెద్ద షాక్. కానీ మేము గాయపడలేదు.. గమ్యాన్ని మార్చలేదు,” అని అన్నారు. గత ప్రభుత్వంలో తీసుకున్న మంచి నిర్ణయాలు, అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలు మర్చిపోలేరని అన్నారు.
పార్టీ పునర్నిర్మాణంలో జగన్ చొరవ
సజ్జల ప్రకారం, పార్టీ పునర్నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రతి గ్రామంలో కొత్తగా కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు. పార్టీ బలోపేతం కోసం గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు నేతలను నియమిస్తున్నారు. ప్రతిరోజూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సుమారు 200 మంది కార్యకర్తలను కలుసుకుని వారితో భవిష్యత్తు కార్యాచరణపై చర్చిస్తున్నారని తెలిపారు.
ప్రజా సమస్యలపై పోరాటమే లక్ష్యం
ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న ప్రభుత్వ అవినీతి, ప్రజలపై భారం వేస్తున్న విధానాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లడమే తమ ప్రధాన లక్ష్యమని సజ్జల పేర్కొన్నారు. “వైసీపీ ప్రజల కోసం పని చేయడం మానదు. అధికారంలో లేని సమయంలోనూ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తాం. ఇది మా కర్తవ్యమనీ, పార్టీ కార్యకర్తల ఇంకా బలంగా ఉందని” స్పష్టం చేశారు.
Read Also : AP : కొత్తగా 2వేల కి.మీ. రోడ్ల నిర్మాణం – సీఎం చంద్రబాబు