yogi adityanath

స్నానం కాదు ఆ నీళ్లు తాగే దమ్ముందా: అఖిలేష్ యాదవ్

దేశరాజధాని ఢిల్లీలో మరికొన్ని రోజుల్లోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈక్రమంలోనే ప్రధాన పార్టీలన్నీ పెద్ద ఎత్తున ప్రచారాలు చేస్తున్నాయి. ముఖ్యంగా దేశంలోని అనేక రాష్ట్రాల నుంచి మద్దతు దారులను తెచ్చుకుంటూ ప్రచార కార్యక్రమాల్లో భాగం చేస్తున్నారు అనేక మంది అభ్యర్థులు. అయితే గురువారం రోజు యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ బీజేపీ తరఫున ఢిల్లీ ప్రచారానికి వెళ్లారు. ఈక్రమంలోనే ఆమ్ ఆద్మీ పార్టీపై నిప్పులు చెరుగుతూ.. ఢిల్లీలోని యమునా నదిని డంపింగ్ యార్డులా మార్చారంటూ విమర్శించారు. ప్రయాగ్ రాజ్‌లో నేను స్నానం చేశాను, మాజీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ ఢిల్లీ యమునా నదిలో స్నానం చేయగలరా అంటూ కామెంట్లు చేశారు.

దీనిపై ఆప్ అధినేత స్పందించకపోయినా అఖిలేష్ యాదవ్ స్పందించారు. యూపీ సీఎం పేరు ప్రస్తావించకుండానే.. స్నానం చేయడం కాదు మీ రాష్ట్రంలోని యమునా నది నీళ్లు తాగే దమ్ము మీకుందా అంటూ ప్రశ్నించారు.
ముఖ్యంగా యమునా నదిని మురుగు కాలువగా మార్చిన ఘనత ఆప్‌కే చెందుతుందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అక్కడితో ఆగకుండా మహా కుంభమేళా సందర్భంగా మంత్రులతో కలిసి తాను ప్రయాగ్ రాజ్‌లో పుణ్యస్నానం ఆచరించానని స్పష్టం చేశారు. అయితే అర్వింద్ కేజ్రీవాల్.. ఇక్కడున్న యమునా నదిలో మునగగలరా అంటూ ప్రశ్నించారు. దీనికి ఆయన నైతికంగా సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేశారు. సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పేరు ప్రస్తావించకుండానే.. గట్టిగా కడిగేశారు. మథుర నుంచి ప్రవహించే యమునా నది నీరు తాగేందుకు మీరు సిద్ధమా అంటూ ప్రశ్నించారు. ప్రస్తుతం అఖిలేష్ యాదవ్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.

Related Posts
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడి..కార్మికునికి త్రీవగాయాలు
Terrorist attack in Jammu and Kashmir.Worker injured

శ్రీనగర్‌: జమ్మూ కశ్మీర్‌లో మరో ఉగ్ర దాడి జరిగింది. ఈసారి పుల్వామా ప్రాంతంలో ఉగ్రవాదులు కాశ్మీరేతర కార్మికులను లక్ష్యంగా చేసుకున్నారు. ఈ దాడిలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఒక Read more

భారతదేశం చేసిన హైపర్సోనిక్ క్షిపణి పరీక్ష: చరిత్రాత్మక విజయం
hypersonic missile

భారతదేశం తొలి లాంగ్-రేంజ్ హైపర్సోనిక్ క్షిపణి ని విజయవంతంగా పరీక్షించింది. ఈ పరీక్ష భారతదేశం యొక్క రక్షణ సామర్థ్యాలను పెంచే దిశగా కీలకమైన అడుగుగా నిలిచింది. ప్రభుత్వ Read more

హీరో విజయ్ దళపతికి వై+ భద్రత
హీరో విజయ్ దళపతికి వై+ భద్రత

తమిళనాడుకు చెందిన ప్రముఖు నటుడు, తమిళ వెట్రి కజగం పార్టీ అధినేత విజయ్ దళపతికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా వై ప్లస్ Read more

ప్రియాంకా గాంధీ బంగ్లాదేశ్ మైనారిటీలకు మద్దతు..
priyanka gandhi bangladesh bag

కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ వాద్రా, సోమవారం పార్లమెంట్లో "పాలస్తీన్" అనే పదం గల బాగ్ ధరించి అందరి దృష్టిని ఆకర్షించిన ప్రియాంకా గాంధీ వాఢ్రా, మంగళవారం Read more