It's endgame for Naxalism in India, says Amit Shah, meets former insurgents

నక్సలిజాన్ని రూపుమాపుతాం: అమిత్ షా

న్యూఢిల్లీ: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్, మహారాష్ట్ర, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణకు చెందిన దాదాపు 30 మంది మాజీ నక్సల్స్‌తో చత్తీస్‌గఢ్‌లోని జగదల్‌పూర్‌లో అమిత్ షా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్రమోడీ సారథ్యంలో 31 మార్చి 2026 నాటికి దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా రూపుమాపుతామని అన్నారు.

నక్సల్ రహిత.. డ్రగ్ రహిత ఇండియా కలను సాకారం చేయడంలో ఛత్తీస్‌గఢ్ పోలీసుల కృషిపై హోంమంత్రి ప్రశ్నంసలు కురిపించారు. వారి సహకారాన్ని సువర్ణాక్షరాలతో లిఖించాలని కొనియాడారు. మిగిలిన నక్సలైట్లు కూడా హింసా మార్గాన్ని విడిచిపెట్టి జనజీవన స్రవంతిలో కలసి అభివృద్ధికి సహకరించాలని కోరారు. మీరు లొంగిపోవాలని, జనజీవన స్రవంతిలో కలవాలని చేసిన ప్రయత్నాలు ఫలించినందుకు తాను ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నానని అమిత్ షా పేర్కొన్నారు.

గత ఏడాది కాలంలో 287 మంది నక్సల్స్‌ను భద్రతా దళాలు హతమార్చాయని, 1000 మందిని అరెస్ట్ చేయగా, 837 మంది లొంగిపోయారని అమిత్ షా తెలిపారు. నక్సలిజంపై మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న కఠిన వైఖరి కారణంగా గత నాలుగు దశాబ్దాల్లో తొలిసారి పౌరులు, భద్రతా బలగాల మరణాల సంఖ్య 100 లోపునకు పడిపోయిందని వివరించారు.

Related Posts
మాజీ ప్రధాని షేక్ హసీనా ఆస్తుల సీజ్: ఢాకా కోర్టు ఆదేశాలు
మాజీ ప్రధాని షేక్ హసీనా ఆస్తుల సీజ్: ఢాకా కోర్టు ఆదేశాలు

భారత్‌లో ఆశ్రయం పొందుతున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా, ఆమె కుటుంబ సభ్యుల ఆస్తులను సీజ్ చేయాలని ఢాకా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ Read more

రాజాసింగ్‌ ఫేస్‌బుక్, ఇన్‌స్టా ఖాతాల తొలగింపు
Deletion of Raja Singh Facebook and Instagram accounts

హైదరాబాద్‌: ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ల నుంచి గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ కు చెందిన 2 ఫేస్‌బుక్‌ పేజీలు, 3 ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలను తొలగించడంపై ఆయన ఎక్స్‌ లో స్పందించారు. Read more

కాసేపట్లో హరీశ్ రావు క్వాష్ పిటిషన్ పై విచారణ
Harish Rao's appeal to farmers

ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీశ్ రావు వేసిన క్వాష్ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసు గట్టిపోటీగా మారుతుండగా, హరీశ్ తనపై Read more

శాసనసభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన మంత్రి పయ్యావుల కేశవ్‌
Minister Payyavula Keshav presented the budget in the Legislative Assembly

అమరావతి: ఏపీ ప్రభుత్వం వార్షిక బడ్జెట్‌ 2024-25ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఈ మేరకు ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్‌ కాపీస్‌లోని పద్దులను చదివి వినిపిస్తున్నారు. అంతకుముందు ఆయన Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *