పాన్ ఇండియా హీరోయిన్‌గా తన స్థానాన్ని మరింత బలపరుచుకుంటూ రష్మిక మందన్న వరుస విజయాలతో దూసుకుపోతుంది. స్టార్ హీరోయిన్‌గా తెలుగు, తమిళ్, హిందీ చిత్రాల్లో తన ప్రత్యేకమైన ముద్ర వేసింది , ఇప్పుడు స్టార్ హీరోలు కూడా రష్మిక డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు.సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ముచ్చటించింది రష్మిక. అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు తెలిపింది. అలాగే ఓ అభిమాని కాలికి తగిలిన గాయం గురించి అడగ్గా రష్మిక ఇలా సమాధానం ఇచ్చింది. కాలికి అయిన గాయం ఇప్పుడిప్పుడే నయమవుతోందని, కానీ, పూర్తిగా సెట్ కావాలంటే మరో 9 నెలల సమయం పడుతుందని తెలిపింది రష్మిక. కాగా నొప్పి ఉన్న కూడా సినిమాల్లో బిజీ అవ్వాలని ప్రయత్నిస్తున్నట్టు చెప్పుకొచ్చింది. ఇప్పుడు బెటర్ గానే ఉందని చెప్పుకొచ్చింది. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
అరడజను సినిమాలు
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది రష్మిక మందన్న . ఇటీవలే పుష్ప 2, ఛావ సినిమాలతో భారీ విజయాలను అందుకుంది. ఇక ఇప్పుడు అరడజను కు పైగా సినిమాల్లో నటిస్తుంది. కాగా ఇటీవల జిమ్‌లో వ్యాయామం చేస్తుండగా రష్మిక గాయపడిన సంగతి తెలిసిందే. ఆమె కుడి పాదానికి గాయం కావడంతో సినిమా షూటింగ్‌ల నుంచి చిన్న బ్రేక్ తీసుకుంది. కాలు నొప్పి ఉన్న కూడా ఛావ సినిమా ప్రమోషన్స్ లో చురుకుగా పాల్గొంది. వీల్ చైర్ లోనే ప్రమోషన్స్ కు వచ్చింది రష్మిక మందన్న.
బ్లాక్‌బస్టర్ విజయాలు
పుష్ప 2’ సినిమాతో రష్మిక భారీ విజయాన్ని అందుకుంది. అల్లు అర్జున్ సరసన ఆమె నటనకు ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన లభించింది.‘ఛావా’ సినిమాతోనూ మళ్లీ తన నటనను రుజువు చేసుకుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది.
ప్రాజెక్టులు
ప్రస్తుతం రష్మిక ‘సికందర్’, ‘కుబేర’, ‘థమ్’ వంటి చిత్రాల షూటింగ్‌లో ఉన్నాయి. సికిందర్ సినిమాలో సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్నారు. అలాగే మురగదాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న కుబేర సినిమాలోనూ రష్మిక హీరోయిన్ గా చేస్తుంది. వీటితో పాటు తమిళ్ సినిమాలు , తెలుగులోనూ ఒకటి రెండు సినిమాలకు సైన్ చేసింది రష్మిక.
రష్మిక కామెంట్స్
అభిమానుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన రష్మిక “నా కాలికి గాయం ఇప్పుడిప్పుడే తగ్గుతోంది. పూర్తిగా కోలుకోవాలంటే 9 నెలలు పడుతుంది. అయినా నొప్పిని తట్టుకుని సినిమాల్లో బిజీగా ఉంటాను” అని చెప్పింది.ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్లో భారీ ప్రాజెక్ట్స్ చేస్తూ స్టార్ హీరోయిన్‌గా నిలుస్తోంది.స్టార్ హీరోలు, డైరెక్టర్లు ఆమెతో సినిమా చేయాలని ఆశక్తి చూపుతున్నారు.