తండేల్ సినిమాకు సంబంధించిన ప్రమోషన్లు బాగా హాట్‌గా సాగుతున్నాయి.అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి కలిసి నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేయనున్న ఈ సినిమా ప్రమోషన్లు దేశవ్యాప్తంగా జోరుగా జరుగుతున్నాయి.ఈ క్రమంలో ముంబైలో తండేల్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఇటీవల జరిగింది.”తండేల్” సినిమా మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో,గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీవాసు నిర్మించారు. డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 7న భారీగా విడుదల కానుంది.
ఈ సినిమా గురించి ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ భారీ బజ్‌ను క్రియేట్ చేసింది.ఈ రోజు బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ ఈ మూవీ హిందీ ట్రైలర్‌ను ముంబైలో లాంచ్ చేశారు.ఈ సందర్భంగా అమీర్ ఖాన్ మాట్లాడుతూ, “అరవింద్ గారు నాకు బ్రదర్ లాంటివారు. ‘తండేల్’ ఫిబ్రవరి 7న వస్తుంది.మా అబ్బాయి నటించిన సినిమా కూడా అదే రోజు వస్తుంది.అయినా, ఈ సినిమా ట్రైలర్ లాంచ్‌కి రావాలని నేను చెప్పాను.కథ బావుంటే, ఆడియన్స్ ఎన్ని సినిమాలు అయినా చూడగలరు.’తండేల్’ ట్రైలర్ నాకు చాలా నచ్చింది. డైరెక్టర్ అద్భుతంగా తెరకెక్కించారు. మ్యూజిక్ కూడా పర్ఫెక్ట్.దేవిశ్రీ చేసిన ‘డింకచిక డింకచిక’ సాంగ్ నాకు చాలా ఇష్టం. హార్ట్ టచ్‌గాఉన్న ఎమోషన్స్ ఈ ట్రైలర్‌లో ఉన్నాయి. చైతన్య చాలా ఫెంటాస్టిక్ యాక్టర్. ఆయనతో వర్క్ చేయడం అద్భుతమైన అనుభవం. సాయి పల్లవి కూడా అద్భుతమైన పెర్ఫార్మర్.
ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి,” అన్నారు.నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ, “తండేల్‌తో పాటే అమీర్ ఖాన్ గారి అబ్బాయి సినిమా కూడా రిలీజ్ అవుతుంది.కానీ ఈ సినిమా ట్రైలర్ లాంచ్‌కి అమీర్ ఖాన్ మాతో ఉంది. ఆయన చాలా కైండ్ పర్సన్. ‘తండేల్’ నిజమైన కథ ఆధారంగా ఉంది.వైజాగ్ తీర ప్రాంతంలో చేపల వేటకు వెళ్లిన కొంతమంది వ్యక్తులు పాక్ సైన్యంవశమై జైలు పాలైన వారి కథ ఇది.ఈ సినిమాను చాలా కష్టపడి తీర్చిదిద్దారు,” అన్నారు.డైరెక్టర్ చందూ మొండేటి మాట్లాడుతూ, “అమీర్ ఖాన్ గారితో స్టేజ్ షేర్ చేయడం గొప్ప అనుభవం.ఆయన సినిమాల్లో 6 నెలలపాటు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేయాలని ఉంది.ఈ కథ చాలా బ్యూటీఫుల్.రాజు అనే క్యారెక్టర్ కరాచీలో తన మనుషుల కోసం చేసిన పని ఆసక్తికరంగా ఉంటుంది,” అన్నారు.