IT rides dilraju

దిల్ రాజు ఇంట్లో మళ్లీ ఐటీ సోదాలు..ఎవరి ఆధ్వర్యంలో అంటే..!!

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇంట్లో మరోసారి ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ సారి ఓ మహిళా అధికారి ఆధ్వర్యంలో ఈ దాడులు జరుగుతుండటం ప్రాధాన్యంగా మారింది. ఇళ్లు, కార్యాలయాలతో పాటు ఇతర ఆస్తులపై కూడా అధికారులు దృష్టి పెట్టారు. గత మూడు రోజులుగా దిల్ రాజు నివాసం, కార్యాలయాల్లో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. పెద్ద ఎత్తున ఈ తనిఖీలు జరగడంతో పరిశ్రమలో ఆసక్తి నెలకొంది. ప్రధానంగా ఈ దాడుల వెనుక ఉద్దేశం ఏమిటి అనే చర్చలు జోరుగా సాగుతున్నాయి.

Advertisements

దిల్ రాజు సోదరుడు శిరీష్, కూతురు హన్షితరెడ్డి, ఇతర బంధువుల ఇళ్లలో ఐటీ అధికారులు తనిఖీలు ముగించారు. వారి ఆస్తుల వివరాలు, లావాదేవీలపై అధికారులు మరింత సమాచారాన్ని సేకరించారని సమాచారం. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అధికారికంగా ఇంకా తెలియరాలేదు. దిల్ రాజు నిర్మాణ సంస్థ టాలీవుడ్‌లో ప్రముఖ స్థానాన్ని కలిగి ఉంది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఐటీ దాడులు జరగడం ఇండస్ట్రీలోనే కాకుండా, సినీ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. ఇక రీసెంట్ గా దిల్ రాజు నిర్మించిన గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలు సంక్రాంతి బరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వీటిలో సంక్రాంతికి వస్తున్నాం మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకొని వారం రోజుల్లోనే రూ.200 కోట్లు వసూళ్లు చేసి ఇంకా హౌస్ ఫుల్ తో రన్ అవుతుంది. ఇక గేమ్ ఛేంజర్ మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ డిజాస్టర్ అయ్యింది.

Related Posts
మాజీ మంత్రి విశ్వరూప్‌ కుమారుడు శ్రీకాంత్‌ అరెస్ట్‌!
Ex minister Vishwaroop son Srikanth arrested

అమరావతి: వైఎస్‌ఆర్‌సీపీ నేత, మాజీ మంత్రి పినిపె విశ్వరూప్‌ కుమారుడు శ్రీకాంత్‌ను ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. దళిత యువకుడు, వాలంటీర్‌ జనుపల్లి దుర్గాప్రసాద్‌ హత్య కేసులో Read more

చలి వలన గాజాలో మరణాలు..
gaza's death due to cold

గాజాలో చలి కారణంగా మరో చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఇది గత వారం రోజుల్లో మృతిచెందిన ఆరు చిన్నారులలో ఇది ఒకటి. ఒక నెల వయస్సున్న అలీ Read more

Pawan Kalyan : రెండు రోజుల పాటు అరకులో పవన్ పర్యటన
pawan araku2

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రెండు రోజుల పాటు అరకు ప్రాంతంలో పర్యటించనున్నారు. రేపు మరియు ఎల్లుండి గిరిజన గ్రామాల్లో పర్యటించేందుకు ఆయన ప్రణాళిక రూపొందించారు. గిరిజనులతో Read more

Sunita Williams:సునీత విలియమ్స్ కు ట్రంప్ ఆహ్వానం ఎప్పుడంటే?
Sunita Williams సునీత విలియమ్స్ కు ట్రంప్ ఆహ్వానం ఎప్పుడంటే

Sunita Williams:సునీత విలియమ్స్ కు ట్రంప్ ఆహ్వానం ఎప్పుడంటే? అంతరిక్షయానం ముగించుకుని భూమికి చేరిన వ్యోమగాములు సునీతా విలియమ్స్ బుచ్ విల్మోర్‌లను వైట్ హౌస్‌కు ఎప్పుడు ఆహ్వానిస్తారనే Read more

×