It is sad that devotees lost their lives.. Jagan

భక్తులు ప్రాణాలు కోల్పోవడం విచారకరం: జగన్‌

అమరావతి: తిరుమల వేంకటేశ్వరస్వామి వైకుంఠ దర్శనం కోసం తిరుపతిలో టోకెన్లు జారీచేస్తున్న కేంద్రం వద్ద తొక్కిసలాటలో భక్తులు మరణించడంపై వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తీవ్ర విచారం వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు.

Advertisements
image
image

గాయపడ్డవారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం వచ్చిన భక్తులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత విచారకరమన్నారు. వెంటనే అక్కడ పరిస్థితులను చక్కదిద్దడానికి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

నిన్న తిరుపతిలో ఏర్పాటు చేసిన టోకెన్ల జారీలో ఐదుగురు మహిళలుతో పాటు ఓ వ్యక్తి మృతి చెందారు. వారిలో విశాఖకు చెందిన జి. రజనీ (47) లావణ్య (40), శాంతి (34), తమిళనాడుకు చెందిన మెట్టు సేలం మల్లికా, కర్ణాటకకు చెందిన నిర్మల (50), నర్సీపట్నంకు చెందిన బొద్దేటి నాయుడుబాబు చనిపోయారు. మరికొందరు తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Related Posts
విజయవాడ నుంచి టూర్ ప్యాకేజీ తో హాయిగా ప్రయాణం
విజయవాడ నుంచి టూర్ ప్యాకేజీ తో హాయిగా ప్రయాణం

సప్త జ్యోతిర్లింగ దర్శన యాత్ర భక్తుల కోసం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) మరో ప్రత్యేక ప్యాకేజీని ప్రవేశపెట్టింది. గతంలో సికింద్రాబాద్ నుంచి Read more

ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డికి పెరుగుతున్న కాంగ్రెస్‌ సీనియర్ల మద్దతు
MLC Jeevan Reddy has growing support from Congress seniors

హైదరాబాద్‌: జగిత్యాల నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డికి పార్టీ సీనియర్‌ నేతల నుంచి మద్దతు పెరుగుతోంది. కాంగ్రెస్‌ నాయకుడు జీవన్‌రెడ్డికి అనుచరుడు Read more

చంద్రబాబు నైజం ఇదే – విజయసాయి రెడ్డి ఘాటు విమర్శలు
vijayasai reddy Tweet to CB

ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి విమర్శలకు దిగారు. 'సూపర్ సిక్స్ ఇస్తే ఏమి, ఇవ్వకపోతే ఏమి. నిత్యావసర వస్తువులు రేట్లు పెరిగితే Read more

Supriya Sule: విమానయాన సంస్థలకు కఠినమైన నిబంధనలు విధించాలి: సుప్రియా సూలే
Supriya Sule impatience with Air India

Supriya Sule: ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే ఎయిర్‌ ఇండియా విమానంపై అసహనం వ్యక్తంచేశారు. తాను ప్రయాణించాల్సిన విమానం కోసం గంటకు పైగా వేచి చూడాల్సి వచ్చిందని Read more