ISS రాత్రివేళ మెరిసిపోతూ కనిపించిన భారత్... ఫొటోలు విడుదల

ISS: రాత్రివేళ మెరిసిపోతూ కనిపించిన భారత్… ఫొటోలు విడుదల

ఇక భూమిని రాత్రివేళ చూడడమంటేనే ఓ అద్భుతం ఇక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) నుంచి తీసిన రాత్రి దృశ్యాలు అయితే మనసు దోచేసేలా ఉంటాయి. తాజాగా ఐఎస్ఎస్ పంచిన కొన్ని ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. వీటిలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నదేమిటంటే — నక్షత్రాల వెలుగు కింద వెలిగిపోతున్న మన భారతదేశం దృశ్యం!ఈ ఫొటోను చూసిన వాళ్లందరూ అబ్బురపడిపోతున్నారు. అంతరిక్షం నుంచి తీసిన దృశ్యంలో భారతదేశం ఓ స్వర్ణ పటముగా మెరుస్తూ కనిపిస్తోంది. కేవలం మన దేశమే కాదు, ప్రపంచంలోని ఇతర ప్రాంతాలు కూడా ఈ ఫొటోలలో ఎంతో ముచ్చటగా కనిపిస్తున్నాయి. మధ్య పశ్చిమ అమెరికాలోని మేఘావృత ప్రాంతం, ఆగ్నేయాసియాలోని తీరప్రాంతాలు, కెనడాలోని ఆకుపచ్చ వెలుగులు…

Advertisements
ISS రాత్రివేళ మెరిసిపోతూ కనిపించిన భారత్... ఫొటోలు విడుదల
ISS రాత్రివేళ మెరిసిపోతూ కనిపించిన భారత్… ఫొటోలు విడుదల

ఇవన్నీ ఫొటోల్లో ఒక కళాత్మక దృశ్యంలా నిలిచాయి.భూమి వక్రత కారణంగా, ఈ దృశ్యాల్లో ఆకాశం వంకరగా మలుపు తిప్పినట్టుగా ఉండటం ప్రత్యేక ఆకర్షణ. ఇది ఫొటోలను మరింత మాయాజాలంగా మార్చేస్తోంది. భూమి మీద వెలుగుతున్న నగరాల కాంతులు, అంతరిక్షంలో మెరిసే నక్షత్రాలు, భూమిని చుట్టేసిన వాతావరణ వెలుగు — ఇవన్నీ ఒకే ఫ్రేమ్‌లో కనిపించడమంటే ఓ అద్భుత కాంబినేషన్ అనడంలో ఎలాంటి సందేహం లేదు.‘నక్షత్రాలు, నగర కాంతులు, వాతావరణ తేజస్సు – అన్నీ ఒకే ఫ్రేమ్‌లో’ అనే క్యాప్షన్‌తో ఈ ఫొటోలు ఐఎస్ఎస్ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయబడ్డాయి. కాసేపులోనే ఈ ఫొటోలు వైరల్‌గా మారాయి.

ISS రాత్రివేళ మెరిసిపోతూ కనిపించిన భారత్... ఫొటోలు విడుదల
ISS రాత్రివేళ మెరిసిపోతూ కనిపించిన భారత్… ఫొటోలు విడుదల

లక్షలాదిమంది లైక్ చేసి, షేర్ చేయడంతో పాటు, ఈ అద్భుత దృశ్యాలపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం భూమికి 370 నుంచి 460 కిలోమీటర్ల మధ్య ఎత్తులో తిరుగుతుంది.అక్కడి నుంచి భూమి మీద రోజూ చాలా ఆసక్తికరమైన దృశ్యాలు కనిపిస్తుంటాయి. ఐఎస్ఎస్ తరచూ అలాంటి ప్రత్యేక క్షణాలను చిత్రాల రూపంలో పంచుకుంటూ ఉంటుంది.ఇదివరకూ నాసాకు చెందిన వ్యోమగామి డొనాల్డ్ పెట్టిట్ భారతదేశంలో జరిగిన మహా కుంభమేళా దృశ్యాన్ని అంతరిక్షం నుంచి పంచిన విషయం గుర్తుండే ఉంటుంది. అప్పట్లో ఆ ఫొటోలు కూడా ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యాయి.ఈ ఫొటోలు చూపించేది కేవలం భూమి అందమే కాదు. మనం నివసిస్తున్న ఈ గ్రహం ఎంత అపూర్వమైందో, ఎంత బంగారు ఖండమైందో కూడా తెలియజేస్తాయి. అంతరిక్షం నుంచి చూసిన దృశ్యాల్లో మన భారతదేశం ఓ ప్రకాశవంతమైన రత్నంలా మెరుస్తోంది.ఈ ఫొటోలు చూసిన ప్రతి ఒక్కరికి దేశభక్తి భావం పొంగిపొర్లకమానదు. మన దేశం ప్రపంచానికి చూపించే ప్రకాశం, శక్తి, అందం – ఇవన్నీ ఈ ఒక్క ఫొటోలో కనిపించేస్తాయి.

Read Also : America: 30 రోజులకు మించి అమెరికాలో ఉండేవారు రిజిస్టర్ చేసుకోవాలి:హోం శాఖ

Related Posts
డిసెంబర్ 9 లోగా రుణమాఫీ పూర్తి చేస్తాం అంటున్న మంత్రి తుమ్మల
tummala runamfi

ఈరోజు తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే రుణమాఫీ కూడా ఒకటి. ఎన్నో ఏళ్లుగా రైతులు రుణమాఫీ కోసం ఎదురుచూస్తున్నారు. గత ప్రభుత్వం రుణమాఫీ చేస్తామని Read more

సంధ్య థియేటర్ విషాదం నేపథ్యంలో బెనిఫిట్ షోలపై నిషేధం – కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
Benefit Show Ban in Telanga

హైదరాబాద్‌ నగరంలోని సంధ్య థియేటర్ వద్ద ఇటీవల జరిగిన ప్రమాదంలో పలువురు అభిమానులు గాయపడగా, కొంతమంది ప్రాణాలు కోల్పోయిన విషాదం అందరిని కుదిపేసింది. ఈ ఘటనపై స్పందించిన Read more

ఫిబ్రవరి 7 అసెంబ్లీ ప్రత్యేక సమావేశం..!
February 7 Assembly special meeting.

హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం బీసీ కులగణన పై ఫోకస్ చేసింది. ఇప్పటికే కులగణన పూర్తి అయిన నేపథ్యంలో ఫిబ్రవరి 2న కులగణన సర్వే రిపోర్ట్‌ ను అధికారులు Read more

పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ సవరణకు కేంద్రం ఆమోదం
polavaram

ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయం అంచనా సవరణకు కేంద్రం ఆమోద ముద్ర వేసింది. ఈ ప్రాజెక్టు 41.15 మీటర్ల వరకు నీరు నిలిపేందుకు సవరించిన Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×