February 7 Assembly special meeting.

ఫిబ్రవరి 7 అసెంబ్లీ ప్రత్యేక సమావేశం..!

హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం బీసీ కులగణన పై ఫోకస్ చేసింది. ఇప్పటికే కులగణన పూర్తి అయిన నేపథ్యంలో ఫిబ్రవరి 2న కులగణన సర్వే రిపోర్ట్‌ ను అధికారులు కేబినెట్ సబ్ కమిటీకి ఇవ్వనున్నారు. బీసీ రిజ్వేషన్ల పెంచాలని కోరుతూ కేంద్రానికి అప్పీలు చేయాలని శాసనసభలో నిర్ణయం తీసుకోనున్నారు. మరోవైపు.. ఇటీవల ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా కుల గణన సర్వే నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సర్వే ఇప్పటికే పూర్తిగా అధికారులు ఫైనల్ రిపోర్టును రెడీ చేశారు. దానిపై ఫిబ్రవరి 5న మంత్రివర్గం భేటీ కానుంది.

image

తర్వాత అసెంబ్లీ సాక్షిగా కలగణనకు అమోదముద్ర తెలిపేందుకు ఫిబ్రవరి 7 నుంచి ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని రేవంత్ సర్కార్ కసరత్తు చేస్తోంది. కులగణన నివేదికపై సభలో చర్చించి ఆ తర్వాత అసెంబ్లీ ఆమోదం తెలపనుంది. అలాగే ఈ కేబినెట్ భేటీలోనే పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశంపైన కేబినెట్ చర్చించనున్నట్లు తెలుస్తోంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు కేబినెట్ ఆమోద ముద్ర వేసి.. అనంతరం పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలనే ప్లాన్‌లో తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

మరోవైపు జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్‌భవన్‌లో జరిగిన ఎట్ హోం కార్యక్రమంలో గవర్నర్‌ జిష్ణుదేవ్ వర్మతో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా భేటీ అయిన విషయం తెలిసిందే. ప్రత్యేక అసెంబ్లీ ఏర్పాటు సమావేశంపై సీఎం ఇప్పటికి గవర్నర్‌తో చర్చించినట్లు తెలుస్తోంది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతోనే ప్రత్యేక సెషన్ ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తుంది.

Related Posts
ప్రపంచంలో అతిపెద్ద ట్రాఫిక్ జామ్ ఇదేనా?
longest traffic jam

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా భక్తులతో కిక్కిరిసిపోవడంతో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానాలు ఆచరించేందుకు లక్షలాది భక్తులు తరలివచ్చారు. ఈ పెరిగిన రద్దీ Read more

2024లో ఫాస్ట్‌ట్యాగ్ టోల్ ఆదాయం!
2024లో ఫాస్ట్ ట్యాగ్ టోల్ ఆదాయం!

డిసెంబర్ 2024 నాటికి, దేశంలోని 1,040 టోల్ బూత్‌ల ద్వారా టోల్ టాక్స్ వసూళ్లు రూ.68,037.60 కోట్లను చేరుకున్నాయి. ఇది 2023లో సేకరించిన రూ.62,293.4 కోట్లతో పోలిస్తే Read more

CM Revanth : సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యేలు, జేఏసీ నేతలు
Congress LP meeting chaired by CM Revanth Reddy today

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అసెంబ్లీలో ఎమ్మెల్యేలు, మాల సంఘాల జేఏసీ నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి, మాల సంఘాల సమస్యలు, సామాజిక Read more

పరిశుభ్రత కోసం ప్రపంచ టాయిలెట్ దినోత్సవం..
world toilet day

ప్రపంచ టాయిలెట్ దినోత్సవం ప్రతి సంవత్సరం నవంబర్ 19న జరుపుకుంటారు. ఈ దినోత్సవం ఉద్దేశం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సానిటేషన్ సమస్యలను పరిష్కరించడం మరియు ప్రజలకు పరిశుభ్రత మరియు Read more