ఒక్కప్పుడు ఒక చిన్న రాకెట్ కోసం అమెరికా వైపు చూసిన భారత్, ఇప్పుడు అదే అమెరికా తయారు చేసిన భారీ శాటిలైట్‌ను నింగిలోకి పంపేందుకు సిద్ధమవుతోంది.ఈ అద్భుత ఘట్టానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ – ఇస్రో (ISRO) నాంది పలికింది. ప్రపంచం ముందే ఒకసారి మరింతగా మెరిసేందుకు భారత రాకెట్ సిద్ధంగా ఉంది.చెన్నైలో నిర్వహించిన కార్యక్రమంలో ఇస్రో చైర్మన్ వి. నారాయణన్ సంచలన ప్రకటన చేశారు. “అమెరికాకు చెందిన 6,500 కిలోల శాటిలైట్‌ను మన రాకెట్‌తో మన నేలమీద నుంచి ప్రయోగించబోతున్నాం,” అని చెప్పారు.ఇది కేవలం ప్రయోగం కాదు, భారత అంతరిక్ష ప్రయాణంలో మరో ఘనమైన అధ్యాయం అని ఆయన వివరించారు.1963లో భారత్, అమెరికా నుంచి అందుకున్న ఒక చిన్న రాకెట్‌తో అంతరిక్ష ప్రయాణం ప్రారంభించింది.అది నవంబర్ 21, 1963. అదే రోజున భారతదేశం తన తొలి ప్రయోగం విజయవంతంగా చేసింది. అప్పట్లో సాంకేతికంగా వెనుకబడిన భారత్, ఇప్పుడు గ్లోబల్ స్పేస్ మార్కెట్‌లో కీలక పాత్ర పోషిస్తోంది.
‘నైసర్’ విజయం భారత్‌కు గర్వకారణం
జూలై 30న భారత్, అమెరికా సంయుక్తంగా రూపొందించిన ‘నైసర్’ ఉపగ్రహాన్ని ప్రయోగించింది.జీఎస్‌ఎల్‌వి ఎఫ్16 ద్వారా ప్రయోగించిన ఈ శాటిలైట్ భూమిపై మార్పులపై కచ్చితమైన సమాచారం అందించనుంది. నాసా శాస్త్రవేత్తలు కూడా ఇస్రో పనితీరును ప్రశంసించగా, భారత్ సామర్థ్యాన్ని మరోసారి నిరూపించుకుంది.పట్టుదల, విజ్ఞానం, స్వదేశీ సాంకేతికతతో ఇస్రో ఏ గమ్యాన్ని అయినా చేరగలదని నిరూపించింది. గత 50 ఏళ్లలో ఎన్నో ఎత్తుల్ని అధిగమించింది.ఇప్పటివరకు 34 దేశాలకు చెందిన 433 శాటిలైట్‌లు భారత రాకెట్ల (Indian rockets) ద్వారా విజయవంతంగా ప్రయోగించబడ్డాయి. ఇది ప్రపంచ అంతరిక్ష వాణిజ్యంలో భారతదేశానికి ప్రత్యేక గుర్తింపునిచ్చింది.
కమ్యూనికేషన్ శాటిలైట్ ప్రయోగం – మరో మెట్టు పైకి
ఇప్పుడు ప్రయోగించనున్న అమెరికా శాటిలైట్ కమ్యూనికేషన్ అవసరాల కోసం తయారైంది. దీన్ని భారత రాకెట్‌తో గగనతలానికి పంపించడం ప్రతిభకు అద్దం పడుతుంది.ఇది కేవలం ఓ కమర్షియల్ మిషన్ కాదు, భారత అంతరిక్ష చరిత్రలో మరొక మైలురాయి.ఇస్రో చైర్మన్ మాట్లాడుతూ, ఇదంతా భారత శాస్త్రవేత్తల కృషి ఫలితమే. అంతరిక్ష రంగంలో మనకు అనేక అవకాశాలు ఉన్నాయ్, అన్నారు.ఇస్రో ప్రస్థానం చూస్తే, మన భవిష్యత్తు అంతరిక్షంలోనే ఉంది అనే నమ్మకం కలుగుతుంది.
Read Also : Telangana rains : తెలంగాణలో మరింత తీవ్ర రూపం దాల్చనున్న వర్షాలు