భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఆధ్వర్యంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (VSSC) విద్యార్థులకు అద్భుత అవకాశాన్ని అందిస్తోంది. ఇస్రో నూతన నోటిఫికేషన్ విడుదల చేసి, జూనియర్ రీసెర్చ్ ఫెలో (JRF), రీసెర్చ్ అసోసియేట్ (RA) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలనుకునే అభ్యర్థులు ఏప్రిల్ 20, 2025 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు విధానం
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 23 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో- జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (JRF) – 21 పోస్టులు, రీసెర్చ్ అసోసియేట్ (RA) – 02 పోస్టులు, ఈ పోస్టుల భర్తీ ఇంటర్వ్యూకే పరిమితం కానుంది. ఎలాంటి రాత పరీక్ష ఉండదు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థులు సంబంధిత విభాగంలో ఎంఈ/ఎంటెక్ లేదా ఎంఎస్సీ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. అలాగే కొంత పని అనుభవం కూడా ఉండాలి. వయో పరిమితి దివ్యాంగులకు – 10 సంవత్సరాలు, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (JRF) – 28 ఏళ్లు లోపు, రీసెర్చ్ అసోసియేట్ (RA) – 35 ఏళ్లు లోపు, వయో పరిమితిలో రిజర్వేషన్ ఆధారంగా సడలింపులు- OBC అభ్యర్థులకు – 3 సంవత్సరాలు, SC/ST అభ్యర్థులకు – 5 సంవత్సరాలు ఈ పోస్టులకు ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఇస్రో అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. చివరి తేది ఏప్రిల్ 20, 2025. ఎంపిక విధానం-సంబంధిత విద్యార్హతలు, అనుభవం, పరిశోధనా ప్రతిభను బట్టి ఎంపిక జరుగుతుంది. ఎలాంటి రాత పరీక్ష ఉండదు, అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇస్రోలో ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయమైన జీతభత్యాలు అందుబాటులో ఉన్నాయి- జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (JRF) ₹37,000/- నెలకు, రీసెర్చ్ అసోసియేట్ (RA) ₹58,000/- నెలకు దీతో పాటు ఇతర ప్రయోజనాలు, అనుబంధ సౌకర్యాలు కూడా అందించనున్నారు.ఇస్రోలో జూనియర్ రీసెర్చ్ ఫెలో & రీసెర్చ్ అసోసియేట్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఇది మంచి అవకాశం. ఇంటర్వ్యూ ద్వారా ప్రత్యక్షంగా ఎంపిక చేయడం అభ్యర్థులకు ఎంతో ప్రయోజనకరం. అందుకే, ఆసక్తి కలిగిన అభ్యర్థులు తక్షణమే ఇస్రో అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి దరఖాస్తు పూర్తి చేయాలి.