Israel-Hamas : ఇజ్రాయెల్- హమాస్ ల మధ్య మరోసారి ఉద్రిక్తతలు నెలకొన్నాయి. తాజాగా గాజా పై టెల్‌అవీవ్ వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఇందులో 50 మందికి పైగా మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్-హమాస్ మధ్య పరిస్థితులు మళ్లీ మొదటికొచ్చాయి. ఏడాదికి పైగా గాజాపై ఇజ్రాయెల్ భీకరమైన యుద్ధం సాగించింది. అయితే జనవరి 19న అంతర్జాతీయ మధ్యవర్తుల చర్చలతో కాల్పుల విరమణకు ఒప్పందం జరిగింది.

పరిస్థితులు మళ్లీ మొదటికే
ఈ సమయంలో ఖైదీ-బందీల మార్పిడి జరిగింది. ఇటీవల ఈ ఒప్పందం గడువు ముగిసింది. అయితే ఈ ఒప్పందాన్ని కొనసాగించాలని ఇజ్రాయెల్ కోరింది. అందుకు హమాస్ ససేమిరా అంది. దీంతో పరిస్థితులు మళ్లీ మొదటికే వచ్చాయి. కాల్పుల విరమణ ముగియడంతో సోమవారం ఇజ్రాయెల్ దళాలు… హమాస్ అంతమే లక్ష్యంగా గాజాపై భీకరమైన దాడులకు పాల్పడింది. ఈ ఘటనలో 44 మంది చనిపోయారు. అలాగే దక్షిణ సిరియాపై కూడా ఇజ్రాయెల్ వైమానిక దాడులకు పాల్పడింది.
ఇజ్రాయెల్ వైమానికి దాడులు
ఈ ఘటనలో ఇద్దరు చనిపోగా.. 19 మంది గాయాలయ్యాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా, దక్షిణ సిరియాలోని మిలటరీ కమాండ్ సెంటర్ లు, ఆయుధాలు, ఆర్మీ వాహనాలు ఉన్న స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ వైమానికి దాడులు చేస్తోంది. సిరియాను అసద్ పాలిస్తున్నప్పుడు ఈ స్థావరాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ మిలిటరీ ఆస్తులను సిరియా నూతన ప్రభుత్వ వర్గాల ఆధ్వర్యంలోని బలగాలు నిర్వహిస్తున్నాయి. వీటి నుంచి ఇప్పుడు తమకు ప్రమాదం పొంచి ఉందనే కారణంగా దాడులు చేస్తున్నామని ఇజ్రాయెల్ చెబుతోంది.