గాజాలో మళ్లీ బాంబులతో దద్దరిల్లింది. గురువారం జరిగిన Israel వైమానిక దాడుల్లో దక్షిణ గాజా ఘోరంగా దెబ్బతిన్నది.పాలస్తీనా వైద్య వర్గాల సమాచారం ప్రకారం, ఈ దాడుల్లో కనీసం 80 మంది మరణించారు. మరో అనేక మంది గాయపడినట్టు పేర్కొన్నారు.దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్ నగరం లక్ష్యంగా దాడులు జరిగాయి. అక్కడే 54 మంది మరణించారు, అందులో మహిళలు, చిన్నారులూ ఉన్నారు.ఇది అధికారికంగా నాసర్ ఆసుపత్రి విడుదల చేసిన వివరాల్లో చెప్పబడింది.

క్యాన్సర్ ఆసుపత్రి పూర్తిగా నిలిచిపోయింది
ఈ దాడుల్లో గాజాలోని ఒకేఒక క్యాన్సర్ ఆసుపత్రి అయిన గాజా యూరోపియన్ హాస్పిటల్ పూర్తిగా పనిచేయడం ఆపేసింది.అక్కడి ఆరోగ్య అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం,అసుపత్రి మౌలిక వసతులు పూర్తిగా ధ్వంసమయ్యాయి.మురుగు నీటి లైన్లు, అంతర్గత విభాగాలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి.

ఇజ్రాయెల్ పూర్తి స్థాయిలో యుద్ధానికి సిద్ధం
ఈ దాడులకు ముందు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కీలక హెచ్చరిక చేశారు.”హమాస్‌ను నిర్మూలించేందుకు గాజాలో భారీగా ప్రవేశిస్తాం” అన్నారు.ఈ వ్యాఖ్యల తర్వాతే ఇజ్రాయెల్ దళాలు చురుకైన దాడులకు దిగాయి.
ఇప్పటివరకు వేలమంది పాలస్తీనియన్లు మరణించారు
మార్చి 18న కాల్పుల విరమణ ముగిసిన తర్వాత…ఇజ్రాయెల్ మళ్లీ దాడులు మొదలు పెట్టింది. అప్పటి నుంచి 2,876 మంది మరణించారు.అక్టోబర్ 7న యుద్ధం ప్రారంభమైన తర్వాత మొత్తం మృతుల సంఖ్య 53,010 కి చేరుకుంది.
ఇజ్రాయెల్ పౌరులను లక్ష్యంగా తీసుకుంటోంది: ఆరోపణలు
గాజాలోని పౌర రక్షణ విభాగ ప్రతినిధి మహ్మూద్ బసల్ మాట్లాడుతూ…ఇజ్రాయెల్ “పౌర జనావాసాలు ఖాళీ చేయించే పద్ధతిని” అనుసరిస్తోందన్నారు.పాఠశాలలు, ఆశ్రయ శిబిరాలపై కూడా దాడుల భయం ఉందన్నారు.వందలాది మంది రాత్రులు వీధుల్లో గడుపుతున్నారు.సహాయం అందేందుకు బృందాలను ఇజ్రాయెల్ అడ్డుకుంటోందన్నారు.
ఆకలితో అలమటిస్తున్న గాజా ప్రజలు
మార్చి 2 నుండి మానవతా సహాయం నిలిచిపోయింది.అర్ధమిలియన్ గాజా ప్రజలు భయంకరమైన ఆకలి సమస్యతో ఎదురవుతున్నారు.అంతర్జాతీయ సంస్థలు ఇదే విషయాన్ని స్పష్టం చేశాయి.