ఇండియా డీఆర్డీవో (DRDO)(డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్) బరాక్ మిస్సైల్ సిస్టమ్‌కి సహకారం అందించింది. ఈ సిస్టమ్‌లో భారతదేశం అభివృద్ధి చేసిన కొన్ని పరికరాలు (equipment) ఉన్నాయి, ముఖ్యంగా సెన్సార్లు (Sensors), కమ్యూనికేషన్ వ్యవస్థలు, మరియు వేర్వేరు టెక్నాలజీలు. దీనివల్ల ఇజ్రాయిల్ మరియు భారత్ మధ్య రక్షణ రంగంలో బలమైన సహకారం ఏర్పడింది.ఇటీవల ఆపరేషన్ సింధూర్ సమయంలోనూ బరాక్ సిస్టమ్‌ను వాడారు.

సంయుక్తంగా డెవలప్ చేశారు
ఇజ్రాయిల్‌పై ఇరాన్ మిస్సైళ్లతో దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. ఆ దాడుల్ని తిప్పికొట్టేందుకు బరాక్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్(Barak System)ను ఇజ్రాయిల్ వినియోగిస్తున్నది. మానవరహిత ఏరియల్ వాహనాలతో పాటు మిస్సైళ్లను కూడా ఆ బరాక్ సిస్టమ్ సమర్థవంతంగా అడ్డుకుంటోంది. ఇజ్రాయిల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్‌తో పాటు భారత్‌కు చెందిన డీఆర్డీవో కూడా ఆ సిస్టమ్ అభివృద్ధిలో పాత్ర పంచుకున్నది. ఇద్దరూ సంయుక్తంగా బరాక్ సిస్టమ్‌ను డెవలప్ చేశారు. వైమానిక ముప్పులను ఎదుర్కొనేందుకు దీన్ని తయారు చేశారు. యూఏవీలు, క్రూయిజ్ మిస్సైళ్లతో పాటు ఎయిర్‌బోర్న్ టార్గెట్లను బరాక్ సిస్టమ్ ఎదుర్కోగలదు.
బరాక్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఓ అత్యాధునిక వ్యవస్థ. షార్ట్ టు మీడియం రేంజ్ మిస్సైల్ డిఫెన్స్ వ్యవస్థను ఇజ్రాయిల్ డెవలప్ చేసింది. నౌకలను రక్షించుకునేందుకు దీన్ని అభివృద్ధి చేశారు. రేడార్ ద్వారా సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్స్ ను ఆ సిస్టమ్ రిలీజ్ చేస్తుంది. ఒకేసారి మల్టిపుల్ టార్గెట్లను అడ్డుకునే సామర్థ్యం బరాక్ సిస్టమ్‌కు ఉన్నది. బరాక్-8 మిస్సైల్ సిస్టమ్‌ను ఎంఆర్-సామ్ అని కూడా పిలుస్తారు. ఇజ్రాయిల్‌తో పాటు ఇండియాకు చెందిన డీఆర్డీవో దీన్ని సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఆ సిస్టమ్‌కు అవసరమైన డుయల్ ఫేస్ రాకెట్ మోటార్ లాంటి సంక్లిష్టమైన పరికరాలను డీఆర్డీవో డెవలప్ చేస్తున్నది.
బాలిస్టిక్ మిస్సైళ్ల చిత్తు
ఇటీవల ఆపరేషన్ సింధూర్ సమయంలో బరాక్ సిస్టమ్‌ను ఇండియా వాడింది. పాకిస్థాన్‌కు చెందిన ఫతా-2 మిస్సైళ్లను దీంతో అడ్డుకున్నారు. ఫతా మిస్సైల్‌తో ఢిల్లీని పాక్ టార్గెట్ చేసింది. అయితే హర్యానాలోని సిర్‌సాలో దాన్ని చిత్తు చేశారు. ఇజ్రాయిలీ మూలాలు ఉన్న బరాక్ సిస్టమ్‌తో హైపర్‌సోనిక్ బాలిస్టిక్ మిస్సైళ్లను కూడా ధ్వంసం చేయవచ్చు అని తెలుస్తోంది. ఇజ్రాయిలీ మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్‌లో ఐరన్ డోమ్ కీలకమైంది. దాంతో పాటు యారో మిస్సైల్స్ కూడా కీలకమైనవే. కానీ బరాక్ సిస్టమ్ వల్ల.. ఎలాంటి వైమానిక దాడినైనా తిప్పికొట్టవచ్చు. ఎయిర్‌క్రాఫ్ట్, క్రూయిజ్ మిస్సైళ్లు, సీ టు సీ మిస్సైల్స్, రాకెట్లు, బాలిస్టిక్ మిస్సైళ్లను బరాక్ సిస్టమ్ చిత్తు చేస్తుంది.
భారతదేశం మరియు ఇజ్రాయిల్ మధ్య రక్షణ రంగంలో బలమైన భాగస్వామ్యం ఉంది. ఈ సహకారంతో, భారత్ తన రక్షణ వ్యవస్థను ప్రగతిశీలంగా అభివృద్ధి చేస్తూ, ప్రస్తుత సాంకేతిక అవసరాలను తీర్చుకుంటోంది.భారతదేశం బరాక్ మిస్సైల్ సిస్టమ్‌తో సహకారం ద్వారా, దేశీయంగా సమర్థవంతమైన రక్షణ వ్యవస్థలు అభివృద్ధి చేసేందుకు మరింత అవకాశాలు కలిగాయి. ఈ సిస్టమ్‌లో భారతదేశం టెక్నాలజీని ఆపరేట్ చేయడం, అలాగే ప్రాదేశిక యుద్ధాలకు తగిన విధంగా అది అనుకూలంగా మారుతుంది.
Read Also:America: డోంట్ వర్రీ – అమెరికాకు ప్రత్యామ్నాయ దేశాలు ఇవే