Israel గాజాలో ఇజ్రాయెల్ దాడుల్లో ఒసామా టబాష్ మృతి

Israel : గాజాలో ఇజ్రాయెల్ దాడుల్లో ఒసామా టబాష్ మృతి

Israel : గాజాలో ఇజ్రాయెల్ దాడుల్లో ఒసామా టబాష్ మృతి తాజాగా గాజాలో హమాస్ కు మరో ఎదురు దెబ్బ తగిలింది.హమాస్ సైనిక నిఘా విభాగానికి అధిపతిగా ఉన్న ఒసామా టబాష్ ను ఇజ్రాయెల్ తమ దాడుల్లో హతమార్చినట్లు అధికారికంగా ప్రకటించింది.దక్షిణ గాజాలో జరిగిన ఈ ఆపరేషన్ లో అతను ప్రాణాలు కోల్పోయినట్లు ఇజ్రాయెల్ రక్షణ దళం (IDF) ధృవీకరించింది.అయితే దీనిపై ఇప్పటివరకు హమాస్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

Israel గాజాలో ఇజ్రాయెల్ దాడుల్లో ఒసామా టబాష్ మృతి
Israel గాజాలో ఇజ్రాయెల్ దాడుల్లో ఒసామా టబాష్ మృతి

ఒసామా టబాష్ ఎవరూ

హమాస్ లో కీలక నేతగా ఉన్న ఒసామా టబాష్, హమాస్ టార్గెటింగ్ యూనిట్ చీఫ్ గా పనిచేశాడు.అతని నేతృత్వంలో హమాస్ దళాలు ఇజ్రాయెల్ పై పలు దాడులు నిర్వహించాయి.హమాస్ వ్యూహాత్మకంగా చేపట్టే దాడులకు ప్రధాన సూత్రధారి ఆయనేనని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది.ఇజ్రాయెల్, హమాస్ మధ్య మూడు రోజుల క్రితం సీజ్ఫైర్ ఒప్పందం ముగిసింది.అప్పటి నుంచి గాజా పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు ముమ్మరంగా కొనసాగిస్తోంది.ఈ దాడులు హమాస్ లక్ష్యాలను కుదేలు చేయడానికేనని ఇజ్రాయెల్ చెబుతోంది. హమాస్ తామే అంగీకరించని కారణంగా దాడులు మళ్లీ ప్రారంభించినట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వెల్లడించారు.

కాల్పుల విరమణ ఒప్పందాన్ని తిరస్కరించిన హమాస్

హమాస్ తాము బందీలను విడుదల చేయడానికి నిరాకరించిందని,అందువల్లే దాడులు మళ్లీ ప్రారంభించామని ఇజ్రాయెల్ ప్రకటించింది.అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్‌కాఫ్ ప్రతిపాదించిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని హమాస్ తిరస్కరించిందని తెలుస్తోంది.తాజా దాడిలో 85 మంది ప్రాణాలు కోల్పోయినట్లు గాజా అధికారులు ప్రకటించారు.మరణించినవారిలో ఎక్కువ మంది పౌరులే ఉన్నారని తెలుస్తోంది.అంతకుముందు జరిగిన దాడుల్లో 400 మందికి పైగా గాజా పౌరులు మరణించినట్లు సమాచారం. హమాస్ పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతాయా లేక మళ్లీ సీజ్ఫైర్ కు అవకాశం ఉందా? అన్నది అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.హమాస్ నుంచి ఎలాంటి ప్రతిస్పందన వస్తుందో చూడాలి.

Related Posts
గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోంది – కేటీఆర్
గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోంది - కేటీఆర్

తెలంగాణ మాజీ మంత్రి కె. తారక రామారావు (కేటీఆర్) కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం చేస్తోంది - కేటీఆర్. Read more

రాజౌరి గ్రామస్థుల నిరసన
village

జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరి జిల్లాలోని బధాల్ గ్రామంలోకి తిరిగి రావడానికి అనుమతించాలని కోరుతూ రాజౌరి గ్రామస్థుల నిరసన చేపట్టారు. అనారోగ్యం కారణంగా 17 మంది మరణించిన తరువాత Read more

టాలీవుడ్ కు గుడ్ న్యూస్ తెలిపిన ఏపీ సర్కార్
AP Sarkar gave good news to

ఏపీ ప్రభుత్వం తెలుగు చిత్రపరిశ్రమకు ముఖ్యమైన సింగిల్ విండో సిస్టంను విశాఖపట్నంలో ప్రవేశపెట్టనుంది. ఈ ప్రక్రియ ద్వారా చిత్రీకరణ అనుమతులు సులభతరం అవుతాయి, తద్వారా చిత్రపరిశ్రమకు మరిన్ని Read more

14వ నారెడ్కో తెలంగాణ ప్రాపర్టీ షో 2024’’నుప్రకటించిన నారెడ్కో తెలంగాణ
Naredco Telangana has announced the 14th Naredco Telangana Property Show 2024

మూడు రోజుల ప్రాపర్టీ షో 2024 అక్టోబర్ 25న హైదరాబాద్ లోని హైటెక్స్ లో ప్రారంభం.. హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో అత్యంత ప్రజాదరణ పొందిన “నారెడ్కో తెలంగాణా Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *