అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి తన గప్పులతో వార్తల్లోకి ఎంట్రీ ఇచ్చారు. గతంలో భారత్-పాకిస్తాన్ మధ్య తానే ఉద్రిక్తతలు తగ్గించానని చెప్పిన ట్రంప్, ఇప్పుడు ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య నెలకొన్న ఘర్షణపై కూడా అదే పంథా కొనసాగిస్తున్నారు.పశ్చిమాసియాలో ఇజ్రాయెల్-ఇరాన్ (Israel-Iran) మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, ట్రంప్ తన సోషల్ మీడియా (Truth Social) వేదికగా చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు. శాంతి ఏర్పాటు కోసం సమావేశాలు జరుగుతున్నాయని చెప్పిన ఆయన, త్వరలోనే ఇరుదేశాల మధ్య కలహం ముగుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
“నాకు క్రెడిట్ ఎవరూ ఇవ్వలేదు” అంటున్న అధ్యక్షుడు
తాను మధ్యవర్తిగా ఉన్నంతమాత్రాన ఎవరూ క్రెడిట్ ఇవ్వలేదంటూ గుసగుసలాడిన ట్రంప్, గతంలో భారత్-పాక్ కాల్పుల విరమణ కూడా తన చొరవ వల్ల జరిగిందని తెలిపారు. అదే సమయంలో సెర్బియా-కొసోవో, ఈజిప్ట్-ఇథియోపియా మధ్య సమస్యలు తానే పరిష్కరించానంటూ కొత్తగా జోడించారు.ట్రంప్ మరోసారి అధ్యక్షుడు బైడెన్‌పై విమర్శల వర్షం కురిపించారు. బైడెన్ తీసుకున్న నిర్ణయాలే దీర్ఘకాలిక అవకాశాలను దెబ్బ తీశాయంటూ ఆరోపించారు. తాను వాటిని సరిచేయగలనని ధీమాగా పేర్కొన్నారు.
ఇరాన్ హెచ్చరికల నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు
ఇరాన్ మాత్రం ఇజ్రాయెల్ దాడులపై స్పందిస్తూ, తమపై దాడులు ఆగితే తామూ నిష్క్రమిస్తామని పేర్కొంది. అయితే ట్రంప్, ఇజ్రాయెల్ చర్యలతో అమెరికాకు సంబంధం లేదని స్పష్టం చేస్తూ, టెహ్రాన్ ఏదైనా చేస్తే తీవ్రమైన ప్రతిచర్య ఎదురవుతుందంటూ హెచ్చరించారు.భారత్-పాక్ ఉద్రిక్తతలపై ట్రంప్ వ్యాఖ్యలపై భారత్ ముందే స్పందించింది. వాణిజ్య చర్చలతో తాము సమస్యను ఎదుర్కొన్నామే కానీ ట్రంప్ కారణంగా ఏమీ జరగలేదని స్పష్టంచేసింది.
Read Also : Ahmedabad : ఒకే బాడీ బ్యాగ్ లో రెండు తలలు : డీఎన్ఏ ప్రక్రియ మళ్లీ మొదటి నుంచి…