ఓవర్ థింకింగ్‌కు ప్రధాన కారణం నెగిటివ్ ఆలోచనలు. మన నియంత్రణలో లేని విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం మనసుకు ఒత్తిడిని పెంచుతుంది. కనుక, ఆలోచనలను సానుకూల దిశగా మళ్లించుకోవడం చాలా అవసరం. ప్రతి సమస్యకూ పరిష్కారం ఉందని నమ్మకంతో ముందుకు సాగితే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.
72 గంటల నిబంధన పాటించండి
మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న విషయం గురించి 72 గంటల పాటు ఆలోచించకుండా ఉండటానికి ప్రయత్నించండి. ఎక్కువ సమయం గడిచిన తర్వాత అదే విషయం అంత ప్రాధాన్యం లేనట్టు అనిపించవచ్చు. జీవితంలో ఏ సమస్య అయినా తాత్కాలికమే, కొంతకాలం తర్వాత వాటి ప్రభావం తగ్గిపోతుంది.

సోషల్ మీడియాకు పరిమితి విధించండి
సోషల్ మీడియా అధికంగా వాడటం కూడా ఓవర్ థింకింగ్‌కు దారితీస్తుంది. ఇతరుల జీవితం మనకంటే మెరుగుగా ఉందని భావించడం, తక్కువ నమ్మకంతో బాధపడడం మొదలవుతాయి. కనుక, సోషల్ మీడియా వినియోగాన్ని నియంత్రించుకోవడం అవసరం. ఒంటరిగా గడిపే సమయాన్ని పాజిటివ్ ఆలోచనల కోసం ఉపయోగించండి.
ధ్యానం, మైండ్ఫుల్ యాక్టివిటీస్ చేయండి
ధ్యానం, యోగా లాంటి మైండ్ఫుల్ యాక్టివిటీస్ చేయడం ద్వారా మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇవి కేవలం ఒత్తిడిని తగ్గించడమే కాకుండా, మన ఆలోచనలను క్రమబద్ధీకరించేందుకు సహాయపడతాయి. రోజూ కనీసం 10-15 నిమిషాలు ధ్యానం చేయడం ద్వారా మనసును కేంద్రీకరించుకోవచ్చు. దీనివల్ల నిజమైన సమస్యలు, ఊహల్లో సృష్టించుకున్న సమస్యల మధ్య తేడా అర్థమవుతుంది.