Cervical cancer

అందుబాటులోకి సర్వైకల్ క్యాన్సర్ టీకా?

సర్వైకల్ క్యాన్సర్ నుంచి మహిళలను రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్- 2025లో చారిత్రక నిర్ణయం తీసుకోనుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నేషనల్ ఇమ్మునైజేషన్ ప్రోగ్రాం పరిధిలోకి ఈ క్యాన్సర్ ను తీసుకొచ్చేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ సమాయత్తం అవుతున్నట్లు సమచారం అందుతోంది. ఈ బడ్జెట్ లోనే ఈ విధానానికి సంబంధించి కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. సర్వైకల్ క్యాన్సర్ టీకా కార్యక్రమంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించనుందని గతేడాది కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఎంతో మంది మహిళలను వేధిస్తోన్న సమస్య సర్వైకల్ క్యాన్సర్. దీనిపై అవగాహన లేకపోవడం వల్ల చిన్నవయసులోనే విద్యార్థినులు, మహిళలు ఈ క్యాన్సర్ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

Advertisements

ఉచితంగా టీకా.. సర్వైకల్ క్యాన్సర్ టీకా ప్రస్తుతం కేవలం ప్రైవేట్ ఆస్పత్రుల్లోనే అందుబాటులో ఉంది. ఒక్కో డోసు ధర రూ. 4000 గా ఉంది. అయితే విద్యార్థినులు, మహిళల కోసం ఈ టీకాను ఉచితంగానే అందించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ టీకా కార్యక్రమం కోసం ఈ బడ్జెట్ లోనే ప్రత్యేకంగా నిధులు కేటాయించనుంది కేంద్ర ప్రభుత్వం. ఈ టీకాను ప్రస్తుతం చిన్నారుల కోసం తీసుకొచ్చిన నేషనల్ ఇమ్మునైజేషన్ ప్రోగ్రాంలో విలీనం చేసి.. విద్యార్థినులు, మహిళలు కోసం అందుబాటులోకి తీసుకురానున్న యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది.

HPV vaccine: సర్వైకల్ క్యాన్సర్ లేదా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అనేది ప్రస్తుతం దేశంలో విస్తృతంగా వ్యాప్తి చెందుతోంది. హ్యూమన్ పాపిలోమా వైరస్(HPV)కారణంగా ఈ వ్యాధి సోకుతుంది. ఇది శరీరంలోకి ప్రవేశించాక క్యాన్సర్ గా మారేందుకు 15-20 ఏళ్లు పడుతోంది.ఎక్కువమంది భాగస్వాములతో లైంగిక చర్యలో పాల్గొనడం, వంశపారంపర్యం, గర్భనిరోధక మందులు అధికంగా వాడటం, ధూమపానం.. తదితర కారణాల వల్ల ఈ వ్యాధి సంక్రమించే అవకాశం ఉంది.

Related Posts
చంద్రబాబు ను కలిసిన బిఆర్ఎస్ నేతలు
tigala krishnareddy

మాజీ మంత్రి మల్లారెడ్డి, బీఆర్ఎస్ నేత తీగల కృష్ణారెడ్డిలు ఈరోజు ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు. ఈ సందర్బంగా తీగల..తాను టిడిపిలో చేరబోతున్నట్లు తెలిపాడు. సోమవారం జూబ్లీహిల్స్ Read more

తెలుగు రాష్ట్రాల మధ్య కొత్త వివాదం
new dispute between Telugu

తెలుగు రాష్ట్రాల మధ్య గోదావరి జలాల అంశంపై మరోసారి వివాదం తలెత్తింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గోదావరి జలాలను రాయలసీమకు తరలించేందుకు బనకచర్ల ప్రాజెక్టును ప్రకటించడం Read more

త్వరలో ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్
Salary of Rs 2 lakh per month for cabinet rank holders - AP Govt

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త అందించనుంది. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని, ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న రెండు డీఏలను చెల్లించాలని సీఎం చంద్రబాబు నాయుడు Read more

మహిళా అత్యాచారం కేసులో బాధితురాలని అరెస్ట్ చేరిన పోలీసులు
ఘజియాబాద్‌లో షాక్.. మహిళా అత్యాచార కేసు మలుపు! బాధితురాలే జైలుకి

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో జరిగిన ఓ ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది. ఓ మహిళ తనపై సామూహిక లైంగికదాడి జరిగినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే విచారణలో ఆమె ఆరోపణలు Read more

×