తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. సాధారణంగా, ప్రత్యేక దర్శన టిక్కెట్లు ముందుగానే బుక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉండటంతో, అనేక మంది భక్తులు వెంటనే వెళ్లాలనుకున్నప్పుడు టిక్కెట్లు దొరకక ఇబ్బందిపడుతున్నారు. అయితే, ఈ సమస్యకు పరిష్కారంగా భారతీయ రైల్వే క్యాటరింగ్ & టూరిజం కార్పొరేషన్ (IRCTC) భక్తుల కోసం తిరుపతి బై వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ అనే ప్రత్యేక టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ఈ ప్యాకేజీ ద్వారా హైదరాబాద్ నుండి తిరుమల శ్రీవారి దర్శనం తో పాటు కాళహస్తి, తిరుచానూరు పుణ్యక్షేత్రాలను కూడా సందర్శించే అవకాశం లభిస్తుంది. ఇది మొత్తం మూడు రోజుల పాటు సాగుతుంది. మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం.

ప్యాకేజీ షెడ్యూల్
మొదటి రోజు – హైదరాబాద్ నుంచి తిరుపతి ప్రయాణం రాత్రి 8:05 గంటలకు కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ (12797) బయలుదేరుతుంది. రాత్రంతా రైలు ప్రయాణం. మరుసటి రోజు ఉదయం 07:05 గంటలకు తిరుపతి చేరుకుంటారు.రెండో రోజు – తిరుచానూరు & శ్రీకాళహస్తి దర్శనం తిరుపతి రైల్వే స్టేషన్ చేరుకున్న వెంటనే IRCTC ఏర్పాట్లు చేసిన హోటల్‌కు భక్తులను తీసుకెళ్తారు. ఫ్రెషప్ అయిన అనంతరం తిరుచానూరు పద్మావతి అమ్మవారి దర్శనం. మధ్యాహ్నానికి శ్రీకాళహస్తి చేరుకుని కాళహస్తీశ్వర స్వామిని దర్శించుకునే అవకాశం. తిరిగి తిరుపతికి వచ్చి హోటల్‌లో బస. మూడో రోజు – తిరుమల శ్రీవారి దర్శనం తెల్లవారు జామునే హోటల్ నుంచి బయలుదేరి తిరుమల వెళ్లాలి. ఉచిత దర్శనం క్యూలైన్ ద్వారా శ్రీవారి దర్శనం తిరిగి తిరుపతిలోని హోటల్‌కు చేరుకోవాలి. సాయంత్రం హోటల్ చెకౌట్ చేసి తిరుపతి రైల్వే స్టేషన్‌కు చేరుకోవాలి. రాత్రి 8:00 గంటలకు తిరిగి వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ (12798) ద్వారా హైదరాబాద్ బయలుదేరతారు. నాలుగో రోజు – తిరుగు ప్రయాణం రాత్రంతా ప్రయాణం చేసి ఉదయం 06:20 గంటలకు కాచిగూడ రైల్వే స్టేషన్‌కు చేరుకోవడం ద్వారా టూర్ ముగుస్తుంది.
ప్యాకేజీ ధర & ఎంపికలు
IRCTC ఈ ప్యాకేజీని కంఫర్ట్ & స్లీపర్ క్లాస్ లో అందుబాటులోకి తీసుకువచ్చింది. కంఫర్ట్ క్లాస్ (3AC) సింగిల్ షేరింగ్ – ₹13,810, డబుల్ షేరింగ్ – ₹10,720, ట్రిపుల్ షేరింగ్ – ₹8,940, స్లీపర్ క్లాస్ సింగిల్ షేరింగ్ – ₹12,030, డబుల్ షేరింగ్ – ₹8,940, ట్రిపుల్ షేరింగ్ – ₹7,170 ప్రత్యేకంగా నడిచే వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ (12797/12798) ద్వారా రైలు ప్రయాణం. ఎక్కడి నుంచి కాచిగూడ రైల్వే స్టేషన్, హైదరాబాద్, నుండి తిరుమల – తిరుచానూరు – శ్రీకాళహస్తి, ప్యాకేజీ మొత్తం వ్యవధి- మూడు రాత్రులు, రెండు పగళ్లు ముందస్తు టికెట్ అవసరం లేకుండా శ్రీవారి దర్శనం, కమ్ఫర్ట్ & స్లీపర్ క్లాస్ ఎంపికలు, ప్రత్యేక హోటల్ బస & భోజన ఏర్పాట్లు.
ఎలా బుక్ చేసుకోవాలి?
టూర్ ప్రారంభం- 2025 మార్చి 29, బుకింగ్ లింక్: www.irctctourism.com, కస్టమర్ కేర్ నంబర్- 1800-110-139 టికెట్లు ముందుగానే బుక్ చేసుకోవాలి. పిల్లలకు తక్కువ ధరలో టికెట్లు లభిస్తాయి. భక్తులు ఒకరు కన్నా ఎక్కువ మంది కలిసి టూర్ బుక్ చేస్తే ప్రత్యేక తగ్గింపులు లభిస్తాయి. తిరుమల శ్రీవారి భక్తుల కోసం ఇలాంటి ప్రత్యేక ప్యాకేజీలు మరింత ఉపయుక్తంగా ఉంటాయి. అనుకున్న వెంటనే దర్శనం పొందే అవకాశం ఇస్తున్న ఈ టూర్ ప్యాకేజీ భక్తుల కోసం గొప్ప అవకాశమనే చెప్పాలి. హైదరాబాద్, తెలంగాణ ప్రాంతాల నుంచి తిరుమల ప్రయాణించే భక్తులు ఈ ప్యాకేజీ ద్వారా ఎంతో తక్కువ ఖర్చులో అద్భుతమైన యాత్రను అనుభవించవచ్చు.