Iranian singer gets 74 lashes for song about hijab

హిజాబ్ పై పాట.. ఇరాన్‌ సింగర్‌కు 74 కొరడా దెబ్బలు

టెహ్రాన్: ఇరాన్‌లో మరోసారి మహిళలు హిజాబ్ ధరించే అంశం కలకలం సృష్టిస్తోంది. హిజాబ్‌కు వ్యతిరేకిస్తూ గాయకుడు మెహదీ యర్రాహి 2023లో ‘రూసారిటో (పర్షియన్ భాషలో మీ హెడ్‌స్కార్ఫ్)’ అనే పాటను విడుదల చేశాడు. ఇస్లామిక్ చట్టానికి వ్యతిరేకంగా పాట పాడినందుకు ఆ సమయంలో యర్రాహిని పోలీసులు అరెస్టు చేశారు. దోషిగా తేలిన అతడు గతేడాది విడుదలయ్యారు. తాజాగా ఈ కేసుపై రివల్యూషనరీ కోర్టు తీర్పునిచ్చింది. అతడికి 74 కొరడా దెబ్బలు విధించాలని ఆదేశించింది.

Advertisements

హిజాబ్ పై పాట ఇరాన్‌

యర్రాహి ఈ పాటను విడుదల

కాగా, 2022లో ఇరాన్‌ అంతటా హిజాబ్‌కు వ్యతిరేక నిరసనలు చెలరేగిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో నిరసనకారులకు మద్దతుగా యర్రాహి ఈ పాటను విడుదల చేశారు. తన శిక్షపై యర్రాహి స్పందిస్తూ స్వేచ్ఛ కోసం మూల్యం చెల్లించడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. 1979 ఇస్లామిక్ విప్లవం నుంచి ఇరాన్‌లో బహిరంగ ప్రదేశాల్లో మహిళలు హిజాబ్ ధరించడాన్ని తప్పనిసరి చేశారు.

2022లో ఇరాన్‌ను హిజాబ్‌ నిరసనలు

అయితే చాలామంది మహిళలు దీన్ని వ్యతిరేకించారు. ఈ అంశాలు అమలయ్యేలా దేశంలోని నైతిక పోలీస్‌ విభాగం పర్యవేక్షిస్తుంది. 2022లో మాసా అమీ అనే యువతి హిజాబ్‌ను సరిగా ధరించలేదన్న అభియోగంపై పోలీసులు అరెస్టు చేయగా.. వారి కస్టడీలో ఆమె మరణించింది. దీంతో 2022లో ఇరాన్‌ను హిజాబ్‌ నిరసనలు కుదిపేశాయి. ఆ మృతి వార్తతో వేలమంది మహిళలు రోడ్డుపైకి వచ్చి నిరసనను తెలియజేశారు. వారికి అంతర్జాతీయ సమాజం మద్దతు తెలుపుతూ ఆందోళనకారులపై టెహ్రాన్ ఉక్కుపాదం మోపడాన్ని తీవ్రంగా ఖండించింది.

Related Posts
మణిపూర్ హింస..ఉన్నతాధికారులతో అమిత్ షా అత్యవసర భేటీ
Manipur violence.Amit Shah emergency meeting with high officials

న్యూఢిల్లీ: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మణిపూర్ లో నెలకున్న పరిస్థితులపై ఉన్నతాధికారులతో రివ్యూ నిర్వహించారు. అల్లర్లకు కారణాలతో పాటు అక్కడి పరిస్థితులను అడిగి Read more

సుప్రీంకోర్టులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట
udhay stalin

తమిళనాడు ఉపముఖ్యమంత్రి మరియు డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా వివాదాస్పదమయ్యాయి. ఈ వ్యాఖ్యలపై హిందూ సంఘాలు Read more

21వ శతాబ్దం భారత్‌దే : ప్రధాని మోడీ
21st Century Ice India.. PM Modi

పారిస్ : ప్రధాని మోడీ భారత ఇంధన వార్షికోత్సవాలు 2024 ను వర్చువల్‌గా ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ..భారత్‌ తన సొంత వృద్ధినే కాకుండా.. ప్రపంచ వృద్ధి రేటను Read more

Donald Trump VS Canada: కెనడాపై మరోసారి ధ్వజమెత్తిన ట్రంప్
మళ్ళీ దేశాలకు ట్రంప్ వార్నింగ్..ఈ సారి ఏ విషయంలో అంటే!

Donald Trump VS Canada: కెనడాపై మరోసారి ధ్వజమెత్తిన ట్రంప్ అమెరికా-కెనడా మధ్య వాణిజ్య యుద్ధం ముదురుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడాపై తీవ్ర Read more

Advertisements
×