ఇరాన్‌తో పెట్రోలియం మరియు పెట్రోకెమికల్ (Petrochemical) ఉత్పత్తుల వ్యాపారంలో నిబంధనలకు విరుద్ధంగా లావాదేవీలు జరిపినందుకు అమెరికా మరోసారి దండయాత్ర చేపట్టింది. ఈ చర్యలలో భారత్‌కి చెందిన ఆరు ప్రముఖ సంస్థలు కూడా ఈ ఆంక్షల తాటికి చిక్కాయి.

పలు దేశాల కంపెనీలను లక్ష్యంగా చేసుకున్న అమెరికా
అమెరికా ప్రభుత్వం ప్రకటించిన తాజా ఆంక్షలు కేవలం భారత్‌కే పరిమితంగా లేవు. టర్కీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE), చైనా మరియు ఇండోనేషియా దేశాలకు చెందిన సంస్థలు కూడా ఈ ఆంక్షలలో భాగమయ్యాయి. వీటిని ఇరాన్ (Iran) కు అనుచితంగా మద్దతు అందిస్తున్నవిగా అమెరికా అభిప్రాయపడుతోంది.
ఏ కంపెనీలు చట్ట విరుద్ధంగా వ్యవహరించాయన్న ఆరోపణ?
2024 జనవరి నుండి 2025 జనవరి మధ్యకాలంలో ఇరాన్ (Iran) నుంచి మిథనాల్, టోలుయీన్, పాలిథిలీన్ వంటి ముఖ్యమైన కెమికల్ ఉత్పత్తులను దిగుమతి చేసినట్లు అమెరికా పేర్కొంది. ఈ క్రింది ఆరు భారతీయ కంపెనీల పేర్లు అమెరికా విదేశాంగ శాఖ పేర్కొంది.
- కాంచన్ పాలిమర్స్
- ఆల్కెమికల్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్
- రామనీక్‌లాల్ ఎస్ గోసాలియా అండ్ కంపెనీ
- జూపిటర్ డై కెమ్ ప్రైవేట్ లిమిటెడ్
- గ్లోబల్ ఇండస్ట్రియల్ కెమికల్స్ లిమిటెడ్
- పర్సిస్టెంట్ పెట్రోకెమ్ ప్రైవేట్ లిమిటెడ్
ఈ కంపెనీలు మిలియన్ల డాలర్ల విలువైన ఇరానియన్ పెట్రోకెమికల్ ఉత్పత్తులను దిగుమతి చేసుకున్నట్లు అని అమెరికా స్పష్టం చేసింది.
ఆస్తులపై నిషేధం.. అంతిమ ఉద్దేశం ఏమిటి?
ఈ ఆంక్షలు కేవలం సాంకేతికమైనవి కావని అమెరికా స్పష్టం చేసింది. “అమెరికాలో లేదా అమెరికా వ్యక్తుల ఆధీనంలో ఉన్న నిందితుల ఆస్తులు, ఆస్తి హక్కులు అన్నీ బ్లాక్ అవుతాయి” అని స్పష్టం చేసింది. అయితే, “ఆంక్షల అంతిమ లక్ష్యం శిక్షించడం కాదు, సానుకూల మార్పును తీసుకురావడం” అని తెలిపింది. ఈ ఆంక్షలపై భారతీయ సంస్థలు ఇంకా ఎటువంటి బహిరంగ ప్రకటనలు చేయలేదు.
Read hindi news: hindi.vaartha.com
Read also: Trump Announces 25% Tariffs on India : భారత్‌పై ట్రంప్ సుంకాల మోత