IPL 2025: ఐపీఎల్ 2025 టాప్ లో ఉన్న జట్టు ఇదే!

IPL 2025: ఐపీఎల్ 2025 టాప్ లో ఉన్న జట్టు ఇదే!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్‌కు సంబంధించిన పాయింట్ల పట్టికలో ఆసక్తికర మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌లలో ఒక్కో జట్టు ఆరేసి మ్యాచ్‌లు ఆడగా, వరుస విజయాలతో గుజరాత్ టైటాన్స్ అగ్రస్థానంలో దూసుకెళ్తోంది. రెండో, మూడో స్థానాల్లో నిలిచిన జట్లు కూడా పోటీపోటీగా రన్‌రేట్ పరంగా తేడాలు చూపిస్తున్నాయి.

Advertisements

గుజరాత్ టైటాన్స్ దూకుడు

గుజరాత్ ఇప్పటికే ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో నలుగిట గెలుపొందగా, రన్‌రేట్ మెరుగుదల కారణంగా ఇతర జట్లను వెనక్కు నెట్టేసింది. అదే సమయంలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మాత్రం ఆశించిన ప్రదర్శన ఇవ్వలేకపోయింది. వరుస పరాజయాలతో CSK జట్టు చివరి స్థానంలో నిలిచింది. ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ (DC), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), లక్నో సూపర్ జెయింట్స్ (LSG) లాంటి జట్లు కూడా నాలుగు విజయాలతో సమానంగా ఉన్నా, నెట్ రన్ రేట్ ఆధారంగా వాటి స్థానాలు మారిపోయాయి. ఆదివారం నాటికి ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ జట్లు ఐదు మ్యాచ్ లు మాత్రమే ఆడాయి. ఇక మూడో స్థానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, నాలుగో స్థానంలో లక్నో సూపర్ జెయింట్స్ జట్లు నిలిచాయి. పాయింట్ల పట్టికలో తొలి నాలుగు స్థానాల్లో ఉన్న జట్లు ప్లేఆఫ్స్ కు చేరతాయనే విషయం తెలిసిందే. ముంబయి ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్ లలో కేవలం రెండు మ్యాచ్ లలో మాత్రమే గెలిచాయి. నెట్ రన్ రేట్ కారణంగా ఈ మూడు జట్లలో ముంబయి ఇండియన్స్ జట్టు ముందుంది. ప్లేఆఫ్ టికెట్లపై పోరు ఇంకా గట్టిగానే కొనసాగుతోంది. టాప్-4 స్థానాల్లో స్థిరపడాలంటే రన్ రేట్ మాత్రమే కాకుండా మిగిలిన మ్యాచుల్లో గెలుపు కీలకం కానుంది.

Read also: Uppal Stadium:హైదరాబాద్ ఉప్ప‌ల్ స్టేడియంలో దొంగ‌ల దందా

Related Posts
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి తాజాగా మరో వివాదం
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి తాజాగా మరో వివాదం

తొలి నుంచే వివాదాలకు మూలకారణంగా మారిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి తాజాగా మరో వివాదం చుట్టుముట్టింది. ట్రోఫీ జరుగుతుందా లేదా అనే అనుమానాలు తొలగిపోయిన క్రమంలోనే, ఈసారి Read more

Cheteshwar Pujara: బ్రియాన్ లారాను వెన‌క్కి నెట్టిన‌ ఛ‌టేశ్వర్ పుజారా
cheteshwar

టీమిండియా క్రికెట్ స్టార్ ఛటేశ్వర్ పుజారా తన ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అరుదైన ఘనతను అందుకున్నాడు రంజీ ట్రోఫీ 2023 రౌండ్ 2లో ఛత్తీస్‌గఢ్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో Read more

శ్రీలంక ఆస్ట్రేలియా మధ్య హై డ్రామా
శ్రీలంక ఆస్ట్రేలియా మధ్య హై డ్రామా

శ్రీలంక, ఆస్ట్రేలియా మధ్య గాలె ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో ఒక అద్భుతమైన ఘటన చోటు చేసుకుంది. క్రికెట్ మైదానంలో ఎప్పుడూ ఊహించని సంఘటనలు Read more

కోహ్లీ @ 102.. అడిలైడ్‌లో రన్ మెషీన్ సరికొత్త చరిత్ర..
virat kohli 1

విరాట్ కోహ్లీ, తన శక్తివంతమైన బ్యాటింగ్‌తో, అంగీకారం పొందిన జట్టు విజయానికి కీలక భాగస్వామిగా నిలిచాడు. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో 143 బంతుల్లో సెంచరీ సాధించిన Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×