ఈ రోజు ఉప్పల్ వేదికపై జరిగే సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మరియు ఢిల్లీ క్యాపిటల్స్ (DC) మధ్య జరుగుతున్న మ్యాచ్ క్రికెట్ అభిమానులు మరియు మెగా అభిమానుల కోసం అత్యంత ఉత్కంఠభరితంగా మారనుంది.
డీసీ వీడియో
ఈ రోజు జరిగే మ్యాచ్ ముందు ఢిల్లీ క్యాపిటల్స్ ఒక వీడియోను విడుదల చేసింది, ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోలో, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ సినిమాకి సంబంధించిన గ్లింప్స్ ఆడియోతో కొన్ని సీన్లు విడుదల చేశారు. అందులో, రామ్ చరణ్ పాత్రలో ఉన్న షాట్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు సమీర్ రిజ్వీ రీక్రియేట్ చేశారు. ఈ వీడియోను ఢిల్లీ క్యాపిటల్స్ తమ అధికారిక “ఎక్స్” (ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేసి, “పెద్ది” టీమ్ రీట్వీట్ చేయడంతో అది మరింత వైరల్ అయ్యింది. ఈ వీడియోకు క్రికెట్ ఫ్యాన్స్, మెగా అభిమానులు, మరియు నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు, ఇది ఒక కొత్త క్రికెట్-సినిమా కలయికగా మారింది.
పాయింట్ల పట్టికలో టీమ్స్
ఇక, ఈ రోజు జరిగే మ్యాచ్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు చాలా కీలకం. ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఈ మ్యాచ్‌లో తప్పనిసరిగా గెలవాల్సిందే. ఓడితే మాత్రం ప్లేఆఫ్స్ రేసు నుంచి ఎస్ఆర్‌హెచ్ నిష్క్రమిస్తుంది. ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచుల్లో మూడింట మాత్రమే గెలిచింది. మిగిలిన నాలుగు మ్యాచుల్లో భారీ మార్జిన్లతో గెలిస్తే నాకౌట్‌పై ఆశలు ఉంటాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో హైదరాబాద్ తొమ్మిదో స్థానంలో ఉంది. మరోవైపు ఢిల్లీ 10 మ్యాచులాడి ఆరు విజయాలతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది. ఇవాళ్టి మ్యాచ్‌లో గెలిచి టాప్‌లో 4 దూసుకెళ్లాలని చూస్తోంది.
Read also: IPL 2025 : భారీ స్కోరు సాధించిన కేకేఆర్