iPhone 17 Series Launch : యాపిల్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐఫోన్ 17 సిరీస్ లాంచ్ డేట్ ఫిక్స్ అయ్యింది. సెప్టెంబర్ 9న ‘ఆ డ్రాపింగ్’ పేరుతో జరగనున్న ప్రత్యేక ఈవెంట్‌లో (iPhone 17 Series Launch) యాపిల్ ఈ కొత్త సిరీస్‌ను ఆవిష్కరించనుంది. ఈసారి ఐదేళ్ల తర్వాత భారీ డిజైన్ మార్పులు రాబోతున్నాయి. ముఖ్యంగా ప్లస్ మోడల్ స్థానంలో కొత్తగా ఐఫోన్ 17 ఎయిర్ వస్తోంది. ఇది కేవలం 5.5 మిల్లీమీటర్ల మందంతో ఇప్పటివరకూ వచ్చిన ఐఫోన్లలో అత్యంత సన్నని మోడల్‌గా రికార్డు సృష్టించబోతోంది.
ఈ ఫోన్‌లో 6.6 అంగుళాల స్క్రీన్, ప్రోమోషన్ సపోర్ట్, కొత్త ఏ19 ప్రాసెసర్ ఉంటాయని లీకులు చెబుతున్నాయి. ఐఫోన్ 17తో పాటు ప్రో, ప్రో మ్యాక్స్ మోడళ్లు కూడా రాబోతున్నాయి. ప్రో మోడల్‌లో కెమెరా మెరుగుదలలు, తక్కువ వెలుతురులో మంచి ఫోటోగ్రఫీ, అధిక జూమ్ ఫీచర్లు ఉండనున్నాయి. అలాగే, ప్రో మ్యాక్స్ మోడల్‌లో ఇప్పటివరకూ లేనంత పెద్ద 5000mAh బ్యాటరీని అమర్చనున్నట్లు సమాచారం.
కొత్త సిరీస్ గ్రీన్, పర్పుల్ వంటి ఆకర్షణీయ రంగుల్లో అందుబాటులోకి రానుంది. ధరల విషయానికి వస్తే, భారతదేశంలో ఐఫోన్ 17 ధర రూ. 89,900 నుంచి మొదలయ్యే అవకాశం ఉంది. ఐఫోన్ 17 ఎయిర్ సుమారు రూ. 95,000 వరకు, ప్రో మ్యాక్స్ మోడల్ ధర రూ. 1,64,900 వరకు ఉండవచ్చని అంచనా. ఐఫోన్లతో పాటు కొత్త యాపిల్ వాచ్, ఎయిర్‌పాడ్స్‌ను కూడా యాపిల్ ఈవెంట్‌లో విడుదల చేయనుంది.
Read also :