రష్యా (Russia) తో యుద్ధం ముగిసిన అనంతరం తాను పదవిని వదులుకుంటానని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రకటించారు.ప్రస్తుతం దేశానికి ఎదురవుతున్న ప్రధాన సవాలు యుద్ధాన్ని నిలిపివేయడమేనని, ప్రజల భద్రత, శాంతి, పునర్నిర్మాణం తన మొదటి ప్రాధాన్యమని ఆయన ఉద్ఘాటించారు. అధ్యక్ష పదవికి మళ్లీ పోటీ చేయడం తనకు ప్రధాన ఉద్దేశం కాదని, దేశ ప్రయోజనమే ముఖ్యం అని జెలెన్‌స్కీ స్పష్టం చేశారు.
Trump UN : ట్రంప్ యూఎన్‌లో ఎదుర్కొన్న చేదు అనుభవాలపై దర్యాప్తు ఆదేశం
వీలైతే ఎన్నికలు నిర్వహించాలని తన దేశ పార్లమెంటును కోరుతానని కూడా తెలిపారు. రష్యాతో జరుగుతున్న యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌లో ఎన్నికలు నిరవధికంగా వాయిదా పడ్డాయి.ఎవరు బతకాలో ఆయుధాలే నిర్ణయిస్తున్నాయని జెలెన్‌స్కీ (Zelensky) ఆవేదన వ్యక్తం చేశారు. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి సర్వ ప్రతినిధి సభలో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం ప్రపంచంలో మానవ చరిత్రలోనే అత్యంత విధ్వంసకరమైన ఆయుధ పోటీ నెలకొందని అన్నారు.
బలహీన అంతర్జాతీయ సంస్థలు ఉక్రెయిన్
రష్యాకు వ్యతిరేకంగా చర్యలు చేపట్టాలని అంతర్జాతీయ సమాజాన్ని ఆయన కోరారు.ఐక్యరాజ్యసమితి (United Nations)తో సహా ఇతర బలహీన అంతర్జాతీయ సంస్థలు ఉక్రెయిన్ (Ukraine), గాజా, సూడాన్‌లలో జరుగుతున్న యుద్ధాలను నిలువరించలేకపోయాయని ఆయన విచారం వ్యక్తం చేశారు. రష్యాతమపై యుద్ధాన్ని కొనసాగిస్తూనే ఉందని ఆయన అన్నారు. పుతిన్ ఇప్పుడు యుద్ధాన్ని ఆపకపోతే అది మరింత విస్తరిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. రష్యా డ్రోన్లు యూరప్ అంతటా ఎగురుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: