భారత మహిళా బాక్సర్లు తమ ప్రతిభను మరోసారి రుజువు చేశారు. తాజా ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ (World Boxing Championship) లో భారత్ రెండు బంగారు పతకాలను సాధించింది. ఈ గౌరవాన్ని జైస్మీన్ లాంబోరియా, మీనాక్షి హుడా సాధించారు. వీరిద్దరూ కఠినమైన పోటీలో అద్భుతమైన ప్రదర్శనతో ప్రత్యర్థులను ఓడించి దేశానికి స్వర్ణాలను అందించారు.
ఆదివారం జరిగిన 48 కిలోల విభాగం ఫైనల్లో మీనాక్షి హుడా అద్భుతమైన విజయాన్ని సాధించారు. కజకిస్థాన్ (Kazakhstan) కు చెందిన సజీమ్ కైజైబేతో ఆమె తలపడ్డారు. 4-1 తేడాతో గెలిచి బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నారు. మ్యాచ్ మొదటి నిమిషం నుంచే మీనాక్షి (Meenakshi) తన ఆత్మవిశ్వాసాన్ని చూపించారు. వ్యూహాత్మకంగా బాక్సింగ్ చేస్తూ ప్రత్యర్థిపై నిరంతర దాడులు జరిపారు. ఆమె పంచ్‌లు క్రమం తప్పకుండా తాకడంతో కజకిస్థాన్ బాక్సర్ రక్షణలో బలహీనమయ్యారు.
మహిళల 57 కేజీల విభాగంలో
అంతకుముందు జరిగిన మహిళల 57 కేజీల విభాగంలో జైస్మీన్ లాంబోరియా (Jaismine Lamboria) 4-1 తేడాతో పోలండ్‌కు చెందిన జూలియాను ఓడించింది. మరోవైపు భారత్‌కు చెందిన నుపుర్ షెరోన్(80+ కేజీలు) సిల్వర్ మెడల్ సాధించగా.. పుజారాణి(80 కేజీలు) బ్రాంజ్ మెడల్ గెలిచింది. పురుషుల విభాగంలో ఈ సారి భారత్‌కు ఒక్క పతకం రాలేదు. 2013 తర్వాత పురుషుల విభాగంలో భారత్ ఒక్క పతకం కూడా సాధించకపోవడం ఇదే తొలిసారి.భారత స్టార్ బాక్సర్, తెలుగు తేజం నిఖత్ జరీన్ పోరాటం మాత్రం క్వార్టర్స్‌లోనే ముగిసింది.

భారీ అంచనాలతో బరిలోకి దిగిన ఈ మాజీ ఛాంపియన్ క్వార్టర్ ఫైనల్లో (In the quarterfinals of the champion) 0-5తో రెండుసార్లు ఒలింపిక్ రజత పతక విజేత బ్యూస్ నాజ్ కకిరోగ్లు (తుర్కియే) చేతిలో చిత్తయింది. దాంతో పతకం లేకుండా నిఖత్ జరీన్ ఇంటిబాట పట్టింది. గతసారి (2023) 50 కిలోలు, అంతకుముందు (2022) 52 కిలోల విభాగాలలో ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన నిఖత్ ఈసారి 51 కిలోల బరిలో దిగింది.
వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ సాధించిన పతకాలు..
- మీనాక్షి హుడా(మహిళల 48 కేజీల)- గోల్డ్ మెడల్
- జైస్మీన్ లాంబోరియా(మహిళల 57 కేజీలు)- గోల్డ్ మెడల్
- నుపుర్ షెరోన్(మహిళల 80+ కేజీలు)- సిల్వర్ మెడల్
- పుజారాణి(మహిళల 80 కేజీలు)- సిల్వర్ మెడల్
Read hindi news: hindi.vaartha.com
Read Also: