వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ (World Athletics Championships) లో భారత జావలిన్ వీరుడు, “గోల్డెన్ బాయ్” అని ప్రసిద్ధి చెందిన నీరజ్ చోప్రా మరోసారి తన అద్భుత ప్రతిభతో ఫైనల్‌కు ప్రవేశించాడు. బుధవారం, టోక్యో (Tokyo) నేషనల్ స్టేడియంలో నిర్వహించిన క్వాలిఫికేషన్ రౌండ్‌లో గ్రూప్-ఏలో బరిలోకి దిగిన నీరజ్, తొలి ప్రయత్నంలోనే అద్భుతంగా 84.85 మీటర్ల దూరానికి జావలిన్ విసరడం ద్వారా తన ఫైనల్ అర్హతను ఖరారు చేసుకున్నారు. దీని ద్వారా అతను మళ్లీ ప్రపంచం ముందుంచి తన నైపుణ్యాన్ని నిరూపించాడు.
గ్రూప్-ఏలో బరిలోకి దిగిన నీరజ్ చోప్రా తొలి ప్రయత్నంలోనే ఈటెను 84.85 మీటర్ల దూరం విసిరి ఫైనల్‌కు అర్హత సాధించాడు. యూజిన్ వేదికగా జరిగిన 2022 అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ (Athletics Championship) లో సిల్వర్ గెలిచిన నీరజ్ చోప్రా.. 2023లో బుడపెస్ట్‌లో స్వర్ణం సాధించి సరికొత్త చరిత్రను సృష్టించాడు. పారిస్ ఒలింపిక్స్‌లో సిల్వర్ మెడల్ గెలిచాడు.
తీవ్ర పోటీ ఎదురు కానుంది
ఈ సారి డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన నీరజ్ చోప్రా (Neeraj Chopra) కు జర్మనీ, చెక్ రిపబ్లిక్ ఆటగాళ్లతో పాటు దాయాదీ పాకిస్థాన్ ప్లేయర్ అర్షద్ నదీమ్ నుంచి తీవ్ర పోటీ ఎదురు కానుంది. భారత్‌కే చెందిన సచిన్ యాదవ్ (Sachin Yadav) తో కలిసి నీరజ్ చోప్రా గ్రూప్-ఏలో ఉండగా.. పాకిస్థాన్ ప్లేయర్ గ్రూప్-బీలో పోటీపడుతున్నాడు. క్వాలిఫికేషన్ రౌండ్‌లో ఈటెను 84.50 మీటర్ల దూరం విసరాల్సి ఉంటుంది. రెండు గ్రూప్స్ నుంచి టాప్-12 మెంబర్స్ ఫైనల్‌కు అర్హత సాధిస్తారు.

ఈ టోర్నీలో నీరజ్ చోప్రా బంగారు పతకం సాధిస్తే.. అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో వరుసగా రెండు స్వర్ణాలు గెలిచిన మూడో జావెలిన్ త్రోయర్ (Javelin thrower) గా నిలిస్తాడు. గతంలో చెక్ లెజెండ్ జాన్ జీలెంజీ(1993, 1995), జర్మనీ ప్లేయర్ జోహన్నెస్ వెట్టెర్(2019, 2022) ఈ ఫీట్ సాధించారు. ప్రస్తుతం జాన్ జీలెంజీ నీరజ్ చోప్రాకు కోచ్‌గా వ్యవహరిస్తుండటం విశేషం.
Read hindi news: hindi.vaartha.com
Read Also: