భారతదేశంలోని ప్రముఖ టెక్ సంస్థల్లో ఒకటైన విప్రో తన హైబ్రిడ్ వర్క్ విధానాన్ని మరింత కఠినతరం చేసింది. ఉద్యోగులు ఇకపై వారానికి కనీసం మూడురోజులు కార్యాలయానికి హాజరవ్వాలని.. ఆ రోజుల్లో కనీసం ఆరుగంటలు ఆఫీసులోనే పని చేయడం తప్పనిసరి చేస్తూ కొత్త నిబంధనలను ఆమలు చేసింది. ఈ విధానం జనవరి 1 నుంచి అధికారికంగా అమల్లోకి వచ్చింది. ఇంతకుముందు ఉన్న సడలింపులతో కూడిన వర్క్-ఫ్రమ్-ఆఫీస్ విధానానికి ఇది భిన్నంగా ఉండడం గమనార్హం. బెంగళూరులో 2.34 లక్షలమంది ఉద్యోగులు బెంగళూరు (Bengaluru) కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న విప్రోలో ప్రస్తుతం సుమారు 2.34 లక్షల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. గత కొంతకాలంగా వారానికి మూడురోజులు ఆఫీసు హాజరు కొనసాగుతున్నప్పటికీ ఇప్పుడు ఇన్-అవుట్ పంచ్ లమధ్య తప్పనిసరిగా ఆరు గంటల కార్యాలయంలో ఉండాలనే నిబంధనను జత చేశారు. ఇది భారతదేశంలో విప్రో అమలు చేస్తున్న హైబ్రిడ్ వర్క్ పాలసీలో ఒక కీలక మార్పుగా భావిస్తున్నారు.
Read also: Road accidents: వేగమా, జీవితమా! ఏది ముఖ్యం?

Wipro shocks employees
సెలువు బ్యాలెన్స్ పై ప్రభావం
ఈ కొత్త విధానం ఉద్యోగుల సెలవుల బ్యాలెన్స్ పై నేరుగా ప్రభావం చూపుతోంది. ఆఫీసులో నిర్ణయించిన సమయం పూర్తి చేయని ఉద్యోగుల సెలవుల ఖాతా నుంచి రోజులు తగ్గించబడుతున్నాయని పలువురు ఉద్యోగులు తెలిపారు. ముఖ్యంగా ఒక రోజు ఆఫీసులో ఆరు గంటల కంటే తక్కువ సమయం గడిపితే.. సగం రోజు సెలవు కోత విధిస్తున్నట్లు సమాచారం. దీంతో ఉద్యోగుల్లో కొంత ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. అంతేకాక విప్రో అందిస్తున్న తాత్కాలిక రిమోట్ వర్క్ సౌకర్యాన్ని కూడా తగ్గించింది. గతంలో క్యాలెండర్ సంవత్స రానికి 15 రోజుల వరకు ఇంటి నుంచి పని చేసే అవకాశం ఉండగా, ఇప్పుడు దాన్ని 12రోజులకు పరిమితం చేసింది. ఈ రిమోట్ వర్క్ రోజులను వ్యక్తిగత సంరక్షణ, అనారోగ్యం లేదా కుటుంబ సంరక్షణ వంటి అవసరాలకోసం మాత్రమే వినియోగించుకోవాలని సంస్థ స్పష్టం చేసింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: