Washington DC security : వైట్ హౌస్ సమీపంలో జరిగిన కాల్పుల ఘటనలో ఇద్దరు నేషనల్ గార్డ్ సిబ్బంది తీవ్రంగా గాయపడిన ఘటనకు సంబంధించి అధికారులు అనుమానితుడిగా అఫ్గానిస్తాన్‌కు చెందిన రహ్మానుల్లా లకాన్‌వాల్‌ను గుర్తించారు. ఈ ఘటన వాషింగ్టన్ డీసీలో సంచలనం సృష్టించింది.
పోలీసు వర్గాల సమాచారం ప్రకారం, 29 ఏళ్ల రహ్మానుల్లా లకాన్‌వాల్ 2021లో అమెరికాలోకి ప్రవేశించిన అఫ్గాన్ పౌరుడు. బుధవారం మధ్యాహ్నం వైట్ హౌస్‌కు (Washington DC security) సమీపంలోని 17వ వీధి, ఐ స్ట్రీట్ ప్రాంతాల్లో నేషనల్ గార్డ్ దళాలు హై అలర్ట్‌తో గస్తీ నిర్వహిస్తున్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, అనుమానితుడు ఓ మలుపు వద్ద నుంచి అకస్మాత్తుగా బయటకు వచ్చి చేతిలోని హ్యాండ్‌గన్‌ను పైకి ఎత్తి నేరుగా ఇద్దరు సైనికులపై కాల్పులు జరిపాడు. అక్కడే ఉన్న ఇతర గార్డ్ సిబ్బంది వెంటనే స్పందించి చర్యలు తీసుకున్నారు. ఆ సమయంలో అనుమానితుడికి కూడా తీవ్ర గాయాలయ్యాయి.
Read also: Commonwealth Games : భారత్‌లోనే 2030 కామన్వెల్త్ గేమ్స్
ఘటన అనంతరం వైట్ హౌస్‌తో పాటు సమీపంలోని ఫెడరల్ భవనాలను కొంతసేపు లాక్‌డౌన్‌లోకి తీసుకున్నారు. వాషింగ్టన్ డీసీ మేయర్ మురియెల్ బౌసర్ మరియు ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ మాట్లాడుతూ, గాయపడిన ఇద్దరు నేషనల్ గార్డ్ సిబ్బంది పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ ఘటనను ధృవీకరిస్తూ, అనుమానితుడికి తీవ్రమైన గాయాలయ్యాయని వెల్లడించారు. ఈ దాడిని ఉగ్రవాద చర్యగా పరిగణించి దర్యాప్తు చేస్తున్నామని ఎఫ్‌బీఐ తెలిపింది. ఈ ఘటన నేపథ్యంలో ట్రంప్ ప్రభుత్వం వాషింగ్టన్ డీసీలో అదనంగా 500 మంది నేషనల్ గార్డ్ సిబ్బందిని మోహరించాలని ఆదేశించింది.
ఆన్‌లైన్‌లో వైరల్ అయిన కొన్ని చిత్రాల్లో అనుమానితుడిని హ్యాండ్‌కఫులతో స్ట్రెచ్చర్‌పై ఆసుపత్రికి తరలిస్తున్నట్లు కనిపించాయి. ఘటనపై పూర్తి వివరాలు సేకరించే పనిలో భద్రతా సంస్థలు కొనసాగుతున్నాయి.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read also :