ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌పై (WhatsApp) నిషేధం విధిస్తామని రష్యా (Russia) హెచ్చరించింది. తమ చట్టాల ప్రకారం సర్వీసులు లేకుంటే పూర్తిగా బ్యాన్ చేస్తామని స్పష్టం చేసింది. చట్టాలను ఉల్లంఘిస్తోందని, నేరాల కట్టడిలోనూ సహకరించడంలేదని రష్యా స్టేట్ కమ్యూనికేషన్స్ వాచ్‌డాగ్ ‘Roskomnadzor’ ఆరోపించింది. టెర్రరిస్టు దాడులు చేసేందుకు యాప్‌ను దుర్వినియోగం చేస్తున్నారని చెప్పింది. యూజర్లు స్వదేశీ యాప్‌లను ఎంచుకోవాలని పేర్కొంది.
Read Also: Indonesia: బ్రహ్మోస్ కొనుగోలుకు సిద్ధమవుతున్న ఇండోనేషియా!

మెటా స్పందన
రష్యా (Russia) ఆరోపణలపై వాట్సాప్ మాతృసంస్థ మెటా (Meta) స్పందించింది. యూజర్ల డేటా, కమ్యూనికేషన్‌ను సురక్షితంగా ఉంచే హక్కును ఉల్లంఘించేలా రష్యా చర్యలు తీసుకుంటుందని.. వాటిని తాము అడ్డుకుంటున్నందుకే మెసేజింగ్ యాప్‌పై నిషేధం విధించడానికి ప్రయత్నిస్తున్నట్లు ఆరోపించింది.
రష్యాలో అత్యంత ప్రజాదరణ పొందిన మెసేజింగ్ సేవల్లో టెలిగ్రామ్, వాట్సాప్ ఉన్నాయి. దేశంలో ఉగ్రవాద, మోసపూరిత కార్యకలాపాలను పరిశీలించేందుకు వీలుగా.. మెసెంజర్‌లు, యాప్‌లతో కలిసి ప్రజల డేటాను యాక్సెస్ చేసే వీలు ఉండాలని రష్యా ప్రభుత్వం కొంత కాలంగా పట్టుబడుతోంది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: