పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైల్లో మరణించినట్లు వదంతులు వ్యాపిస్తున్న నేపథ్యంలో.. ఆయన ముగ్గురు సోదరీమణులు ఆయన్ను కలిసేందుకు ప్రయత్నించారు. ముఖ్యంగా నొరీన్ ఖాన్, అలీమా ఖాన్, ఉజ్మా ఖాన్‌లు సోదరుడి కోసం జైలు వద్దకు వెళ్లగా.. తమపై పోలీసులు తీవ్రంగా దాడి చేశారని ఆరోపించారు.
Read Also: Hong Kong: హాంగ్‌కాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం.. నలుగురు మృతి
శాంతియుతంగా నిరసన
రావల్పిండిలోని అదియాలా జైలు వెలుపల తమను, తమ పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ (PTI) మద్దతుదారులను పోలీసులు హింసించారని పేర్కొన్నారు. గత మూడు వారాలకు పైగా తమ సోదరుడిని కలిసేందుకు అనుమతించకపోవడంతో.. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన చెందుతూ తాము శాంతియుతంగా నిరసన తెలియజేసినట్లు వివరించారు.
కానీ పంజాబ్ పోలీసులు మాత్రం తమపై ఉద్దేశపూర్వకంగానే దాడి చేశారని ఇమ్రాన్ ఖాన్ సోదరీమణులు ఆరోపించారు.ఈ ఘటనపై పంజాబ్ పోలీసు చీఫ్ ఉస్మాన్ అన్వర్‌కు రాసిన లేఖలో.. “ఈ హింస ఘోరమైనది, ప్రణాళికాబద్ధమైనది, ఎలాంటి ప్రేరణ లేకుండా పోలీసు సిబ్బందితో నిర్వహించబడింది” అని పేర్కొన్నారు.

2023 ఆగస్టు నుంచి అదియాలా జైలులో ఉన్నారు
నిరసన తెలుపుతున్న సమయంలో రోడ్లను గానీ, ప్రజల కదలికలను గానీ తాము అడ్డుకోలేదని నొరీన్ నియాజీ తెలిపారు.కాగా, పలు కేసుల్లో దోషిగా తేలిన ఇమ్రాన్ ఖాన్ 2023 ఆగస్టు నుంచి అదియాలా జైలులో ఉన్నారు. ప్రస్తుతం ఆయన్ను ఏకాంత నిర్బంధంలో ఉంచారని, కనీసం పుస్తకాలు చదవనీయడం లేదని,
న్యాయవాదులతో మాట్లాడేందుకు కూడా అనుమతించడం లేదని పీటీఐ వర్గాలు ఆరోపిస్తున్నాయి. సోహైల్ అఫ్రిది కూడా ఇమ్రాన్‌ను కలిసేందుకు ఏడుసార్లు ప్రయత్నించినప్పటికీ.. జైలు అధికారులు నిరాకరించారని గుర్తు చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: