ఉక్రెయిన్‌తో యుద్ధం కొనసాగుతున్న సమయంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) కీలక వ్యాఖ్యలు చేశారు. తమకు వ్యతిరేకంగా వ్యవహరించే దేశాలను చట్టబద్ధమైన లక్ష్యాలుగా పరిగణించే అధికారం రష్యాకు ఉందని ఆయన స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌కు మద్దతుగా సైనిక బలగాలను మోహరించే ఏ దేశాన్నైనా రష్యా (Russia) లక్ష్యంగా చేసుకుంటుందని హెచ్చరించారు.పుతిన్ మాట్లాడుతూ, ఉక్రెయిన్‌కు మద్దతుగా బలగాలను మోహరించడం వల్ల దీర్ఘకాలిక శాంతి సాధ్యం కాదన్నారు. పశ్చిమ దేశాలతో ఉక్రెయిన్ కొనసాగిస్తున్న సన్నిహిత సైనిక సంబంధాలే ప్రస్తుత యుద్ధానికి ప్రధాన కారణమని వ్యాఖ్యానించారు. శాంతి చర్చలే పరిష్కార మార్గమని పుతిన్ అభిప్రాయపడ్డారు.
శాంతి చర్చలే సమాధానమని స్పష్టం
ఇరు దేశాల మధ్య చర్చలు జరిపి యుద్ధానికి ముగింపు పలికితే, ఉక్రెయిన్‌కు మద్దతుగా ఇతర దేశాలు బలగాలను పంపాల్సిన అవసరమే ఉండదని ఆయన చెప్పారు. నిజంగానే శాంతి కోరుకుంటే సైనిక మోహరింపులు అవసరం లేదని తేల్చి చెప్పారు.రష్యా చేసుకున్న ఒప్పందాలకు ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని పుతిన్ పునరుద్ఘాటించారు. తమ వైఖరిపై ఎటువంటి సందేహం ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు. రష్యా తరఫున శాంతి సాధనకే ప్రాధాన్యం ఇస్తామని మరోసారి నొక్కిచెప్పారు.ఇటీవల ప్యారిస్‌లో 26 యూరప్ దేశాల నేతలు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో సమావేశమయ్యారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. యూరప్ దేశాలు తీసుకుంటున్న నిర్ణయాలు ఉక్రెయిన్ యుద్ధాన్ని మరింతగా ముదిరించే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.
ఉక్రెయిన్ సంక్షోభం కొనసాగుతున్న నేపథ్యంలో పుతిన్ సందేశం
ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో పుతిన్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమయ్యాయి. యుద్ధం ముగిసే అవకాశాలు ఎప్పటికప్పుడు చర్చకు వస్తున్నా, పశ్చిమ దేశాల జోక్యం పెరుగుతుందన్నది రష్యా ఆందోళనగా ఉంది.ఉక్రెయిన్‌తో యుద్ధం కొనసాగుతున్న క్రమంలో పుతిన్ చేసిన ఈ హెచ్చరికలు రష్యా వైఖరిని స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఉక్రెయిన్‌కు మద్దతుగా బలగాలు మోహరించే దేశాలను లక్ష్యంగా చేసుకోవడమే కాకుండా, శాంతి చర్చలే పరిష్కారం అని ఆయన చెబుతున్నారు. పశ్చిమ దేశాల నిర్ణయాలు భవిష్యత్ పరిణామాలను నిర్ణయిస్తాయని అంతర్జాతీయ వర్గాలు భావిస్తున్నాయి.
Read Also :