Benjamin Netanyahu: పశ్చిమ ఆసియాలో యుద్ధం తీవ్రరూపం దాల్చింది. ఇరాన్ నుంచి ఎదురవుతున్న ముప్పును శాశ్వతంగా తొలగించేందుకు ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా సైనిక చర్యను ప్రారంభించాయని ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు అధికారికంగా ప్రకటించారు. శనివారం జరిగిన దాడుల అనంతరం ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ, ఇరాన్‌లోని ఉగ్రవాద పాలనను అదుపు చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
Read Also: America, Israel: అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ ప్రతిదాడి

అణ్వాయుధ దేశంగా ఇరాన్.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోం
ఈ ఆపరేషన్ యొక్క ప్రధాన లక్ష్యం ఇరాన్‌ను అణ్వాయుధ దేశంగా మారకుండా అడ్డుకోవడమేనని నెతన్యాహు స్పష్టం చేశారు. “ఇరాన్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వాయుధాలు కలిగి ఉండనివ్వబోం. అది ప్రపంచ శాంతికి ముప్పు” అని ఆయన వ్యాఖ్యానించారు. ఇరాన్ ప్రజలు తమ భవిష్యత్తును తామే నిర్ణయించుకునే స్వేచ్ఛను పొందేందుకు, ప్రస్తుత నిరంకుశ పాలన నుంచి విముక్తి కలిగించేందుకు ఈ సైనిక చర్య దోహదపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: