జైశంకర్ తో యుఎస్ మంత్రి భేటీల ఒకవైపు హెచ్ 1బి వీసా లక్షడాలర్లకు పెంపు, మరోవైపు సుంకాల పెంపుపై అమెరికా భారత్ ల మధ్య గతకొన్ని రోజులుగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ప్రత్యేకంగా అమెరికాలో నివసిస్తున్న భారతీయుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఈ పరిస్థితులో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ తమకు చాలా ముఖ్యమని.. ఆదేశం ముఖ్యమైన భాగస్వామి అని అన్నారు. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 80వ సెషన్ సందర్భంగా జైశంకర్, రూబియో లోట్టే న్యూయార్క్ ప్యాలెస్ లో సమావేశం అయ్యారు. దీని తరువాత మార్కో ఎక్స్ పోస్ట్ పెట్టారు. ట్రంఫ్ టారిఫ్(Trump Tariff) ల తరటువాత ఇరుదేశాల విదేశాంగ మంత్రులూ కలవడం ఇదే మొదటిసారి.
కీలక విషయాలపై చర్చ

యూఎన్టీఏలో భారత విదేశాంగ మంత్రి(Foreign Minister) జైశంకర్ తో సమావేశమయ్యానని చెప్పారు. వాణిజ్యం, రక్షణ ఔషధాలు వంటి కీలకమైన అంశాలపై చర్చలు జరిపామని తెలిపారు. ఈ సందర్భంగా భారత్ తమకు ఎంతో కీలకమని అన్నారు. క్వాడ్ తో సహా ఇండో-పసిఫిక్ ప్రాంతాలను ప్రోత్సహించేందుకు కలిసి పనిచేసేందుకు రూబియో, జైశంకర్ లు అంగీకరించారని అమెరికా ప్రకటించింది. మరోవైపు మార్కో రూబియోతో భేటీ కావడం ఆనందంగా ఉందంటూ భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఎక్స్ పోస్ట్ చేశారు.
అంతర్జాతీయ, ద్వైపాక్షిక అంశాలపై తమ మధ్య చర్చలు జరిగాయని తెలిపారు. ప్రాధాన్యరంగాల్లో పురోగతి సాధించేందుకు సంప్రదింపులు జరుపుకోవాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. ఈ సమావేశంలో అదనపు సుంకాలు, హెచ్ 1బి వీసా ఫీజు విషయాలు కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. రెండుదేశాల మధ్య జరిగిన భేటీతో రెండుదేశాల మధ్య మళ్లీ స్నేహసంబంధాలు మెరుగుపడే అవకాశాలున్నాయని నిపుణులు అంటున్నారు.
మార్కో రూబియో ఎవరు?
మార్కో రూబియో అమెరికా రిపబ్లికన్ పార్టీ సీనియర్ సెనేటర్.
ఆయన భారత్ గురించి ఏమన్నారు?
భారత్ ఆర్థిక, భద్రతా రంగాల్లో అమెరికాకు అత్యంత అవసరమని అన్నారు
Read hindi news: hindi.vaartha.com
Read Also: