జమ్మూకాశ్మీర్‌లోని పహల్గామ్ వద్ద ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడిలో 26 మంది అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. ఈ నేపథ్యంలో ఉగ్రవాదానికి మద్దతు ఇస్తోందన్న ఆరోపణలతో భారత్ పాకిస్థాన్‌పై ‘ఆపరేషన్ సింధూర్’(Water dispute) చేపట్టడంతో పాటు పలు కఠిన చర్యలను అమలు చేసింది. అందులో భాగంగా సింధూ జలాల ఒప్పందాన్ని (Indus Waters Treaty – IWT) నిలిపివేయడం కీలక నిర్ణయంగా మారింది.
Read also: Bangladesh : మరోసారి భగ్గుమంటున్న బంగ్లాదేశ్

ఒప్పందం బలహీనమవుతోందన్న పాక్ ఆరోపణలు.. నీటి కొరతపై ఆందోళన
ఈ నిర్ణయంపై తాజాగా పాకిస్థాన్ డిప్యూటీ ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భారత్ ఉద్దేశపూర్వకంగానే సింధూ జలాల ఒప్పందాన్ని బలహీనపరుస్తోందని ఆరోపించారు. ఈ చర్యల ప్రభావంతో పాకిస్థాన్‌లో నీటి కొరత తీవ్రంగా పెరిగిందని, ప్రజలు దాహంతో ప్రాణాలు కోల్పోయే పరిస్థితి తలెత్తుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్ ఒప్పందాన్ని(Water dispute) నిలిపివేయడంతో పాకిస్థాన్ వ్యవసాయ రంగం తీవ్రంగా దెబ్బతింటోందని దార్ తెలిపారు. సింధూ నది వ్యవస్థపై భారత్ తీసుకుంటున్న చర్యలు ఒప్పంద మూల సూత్రాలకే విరుద్ధంగా ఉన్నాయని విమర్శించారు. చీనాబ్ నది ప్రవాహంలో మార్పులపై పాకిస్థాన్ వివరణ కోరిన మరుసటి రోజే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
“ఈ ఏడాది ఏప్రిల్‌లో భారత్ సింధూ జలాల ఒప్పందాన్ని ఏకపక్షంగా నిలిపివేయడం చూశాం. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఒప్పందానికి విఘాతం కలిగించడమే కాకుండా, ప్రాంతీయ స్థిరత్వానికి మరియు అంతర్జాతీయ చట్టాల గౌరవానికి భంగం కలిగిస్తున్నాయి” అని ఇషాక్ దార్ వ్యాఖ్యానించారు.
భారత్ నీటి ప్రవాహాన్ని నియంత్రిస్తోందన్న ఆరోపణలపై పాకిస్థాన్ సింధూ కమిషనర్, భారత సింధూ కమిషనర్‌కు లేఖ రాసినట్లు దార్ వెల్లడించారు. నీటి సరఫరా తగ్గడంతో పాకిస్థాన్‌లో వ్యవసాయం, జీవనోపాధి తీవ్ర ప్రమాదంలో పడిందని ఆయన అన్నారు. అంతేకాకుండా సింధూ నది జలాలకు సంబంధించిన డేటాను కూడా భారత్ నిలిపివేసిందని మండిపడ్డారు. నీటిని అడ్డుకోవడం కూడా యుద్ధాన్ని ప్రేరేపించే చర్యగానే పరిగణించాలని ఆయన వ్యాఖ్యానించారు.
సింధూ జలాల ఒప్పందం నేపథ్యం
సింధూ జలాల ఒప్పందం 1960లో భారత్–పాకిస్థాన్ మధ్య కుదిరిన కీలక అంతర్జాతీయ ఒప్పందం. ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో ఈ ఒప్పందం అమల్లోకి వచ్చింది. ఈ ఒప్పందం ప్రకారం సింధూ నది వ్యవస్థలోని ఆరు ఉపనదుల నీటి వినియోగాన్ని రెండు దేశాలు పంచుకుంటాయి.
తూర్పు నదులైన రావి, బియాస్, సట్లెజ్ నదులపై భారత్‌కు హక్కులు ఉండగా, పశ్చిమ నదులైన సింధు, చీనాబ్, జీలం నదులు పాకిస్థాన్‌కు కేటాయించబడ్డాయి. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ ఒప్పందం ఇప్పుడు భారత్–పాకిస్థాన్ మధ్య మరో వివాదాస్పద అంశంగా మారుతోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: