బంగ్లాదేశ్ (Bangladesh) లో హిందూ మైనార్టీలపై దాడుల పరంపర కొనసాగుతోంది. దేశంలో నెలకొన్న అశాంతి నేపథ్యంలో, తాజాగా, భర్తను కోల్పోయిన ఓ హిందూ మహిళపై ఇద్దరు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను చెట్టుకు కట్టేసి జుట్టు కత్తరించారు. కాలిగంజ్ జిల్లాలోని జినైదా ఈ దారుణం చోటుచేసుకుంది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదుచేశారు. ఫిర్యాదు ప్రకారం.. కాళీగంజ్ మున్సిపాల్టీ పరిధిలోని వార్డు నెంబరు 7లో షాహిన్, అతడి సోదరుడి వద్ద రెండున్నరేళ్ల కిందట రెండంతస్తుల భవనంతో సహా మూడు సెంట్ల స్థలం కొనుగోలు చేశారు. ఇందుకు వారికి 2 మిలియన్ టాకాలు ఆమె చెల్లించారు.
Read also: JD Vance: అమెరికా ఉపాధ్యక్షుడు నివాసంపై దాడి..? నిందితుడి అరెస్ట్
వేధింపులు
ఆ తర్వాత షాహిన్ ఆమెకు అసభ్యకరమైన ప్రతిపాదనలు చేయడం మొదలుపెట్టాడు. వాటిని తిరస్కరించడంతో ఆమెను వేధింపులకు గురిచేశాడు. శనివారం సాయంత్రం బాధితురాలి ఇంటి నుంచి బంధువులు రాగా.. షాహిన్, అతడి సహచరుడు హసన్ బలవంతంగా ఇంట్లోకి చొరబడి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత 50,000 టాకాలు (సుమారు రూ. 37,000) ఇవ్వాలని డిమాండ్ చేశారు. వారు అడిగినట్టు డబ్బులు ఇవ్వకపోవడంతో బాధితురాలు, ఆమె బంధువులను కొట్టి ఈడ్చుకెళ్లారు. ఆమె సహాయం కోసం కేకలు వేయడంతో చెట్టుకు కట్టేసి, జుట్టును కత్తరించి ఈ తతంగాన్ని తమ మొబైల్ ఫోన్‌లో రికార్డు చేసి, వీడియోను సోషల్ మీడియాలో పెట్టారు.

మహిళను చిత్రహింసలకు గురిచేయడంతో ఆమె స్పృహకోల్పోయింది.కాపాడిన స్థానికులు.. చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. హాస్పిటల్ సూపరింటిండెంట్ డాక్టర్ మహ్మద్ ముస్తాఫిజర్ రెహ్మాన్ మాట్లాడుతూ.. ఏం జరిగిందనేది ముందు బాధితురాలు చెప్పలేదని అన్నారు. వైద్య పరీక్షల్లో ఆమెపై అత్యాచారం జరిగినట్టు గుర్తించామని చెప్పారు. బాధితురాలి కాళిగంజ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. షాహిన్, హసన్‌లపై పోలీసులు కేసు నమోదుచేశారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: