పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లో ప్రజల హక్కుల కోసం ప్రారంభమైన ఆందోళనలు భారీ ఉద్రిక్తతలకు దారితీశాయి. పోలీసులు కాల్పులు(Police firing) జరపడంతో ముగ్గురు పౌరులు ప్రాణాలు కోల్పోగా, పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు.
Read also: floods: భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన మహారాష్ట్ర

స్థానిక మీడియా సమాచారం ప్రకారం, కాల్పుల్లో ముస్తాక్ అహ్మద్, నదీమ్ అబ్బాసి సహా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రజల డిమాండ్లను పట్టించుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని నిరసనకారులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం సమస్యలను పరిష్కరించడంలో విఫలమవ్వడంతో ప్రజల్లో అసహనం ఉప్పొంగిందని వారు తెలిపారు.
ముజఫరాబాద్ సహా పలు నగరాల్లో ప్రజల నిరసనలు తీవ్రతరం
జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ అధ్యక్షుడు షౌకత్ నవాజ్ మీర్ ముజఫరాబాద్‌లో(Nawaz Mir in Muzaffarabad) మాట్లాడుతూ ప్రభుత్వంపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. “ప్రభుత్వ యంత్రాంగమే తమ ప్రజలపై కాల్పులు జరిపింది. ప్రజల ప్రాణాలపై కుట్ర జరిగింది” అని ఆయన విమర్శించారు. అలాగే, మీడియా కూడా తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.
మరోవైపు, మిర్‌పూర్, కోట్లి, ముజఫరాబాద్ నగరాల్లో వేలాదిమంది ప్రజలు రోడ్లపైకి వచ్చి భారీ ర్యాలీలు నిర్వహించారు. ప్రభుత్వం వ్యతిరేక నినాదాలు చేస్తూ తమ హక్కులను కాపాడాలని డిమాండ్ చేశారు. పలు సంఘాలు ఆన్‌లైన్‌లో అన్వర్ ప్రభుత్వాన్ని అసమర్థమని, ప్రజలను అణచివేస్తోందని విమర్శిస్తున్నాయి.
పీఓకేలో ఎన్ని మంది ప్రాణాలు కోల్పోయారు?
పోలీసుల కాల్పుల్లో ముగ్గురు పౌరులు మృతిచెందారు.
ఈ ఘటనలో ఎన్ని మంది గాయపడ్డారు?
పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: