రెండు రోజుల పాటు జపాన్‌లో ప్రధాని మోదీ (Prime Minister Modi)పర్యటించనున్నారు. విదేశాంగ శాఖ ప్రతినిధి విక్రమ్ మిశ్రీ (Vikram Misri) ఈ విషయాన్ని ఇవాళ వెల్లడించారు. ఆగస్టు 29వ తేదీన మోదీ జపాన్ వెళ్లనున్నట్లు ఆ శాఖ పేర్కొన్నది. జపాన్ ప్రధాని షిగేరు ఇషిబాతో ఆయన మాట్లాడుతారు. 2014లో దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు 8 సార్లు జపాన్‌కు వెళ్లారు. రెండు దేశాల మధ్య బంధాన్ని బలోపేతం చేస్తున్నట్లు ఆయన చెప్పారు. జపాన్ నుంచి ఆయన నేరుగా చైనాకు వెళ్తారు.

విదేశాంగ శాఖ కార్యదర్శి మీడియాతో మిశ్రీ (Vikram Misri)మాట్లాడుతూ రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సమావేశాలు జరగనున్నట్లు చెప్పారు. ఆ మీటింగ్‌లకు చెందిన అంశాలను ఫైనలైజ్ చేస్తున్నట్లు తెలిపారు. దీనిపై అప్‌డేట్స్ ఇస్తామన్నారు. భారత్, జపాన్‌కు క్వాడ్ గ్రూపు దేశాలు కీలకమైనవన్నారు. జపాన్‌లో పర్యటన ముగిసన తర్వాత చైనీస్ పోర్టు నగరం తియాంజిన్‌కు మోదీ వెళ్తారు. అక్కడ ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ ఒకటి వరకు జరిగే షాంఘై సహకార సంస్థ మీటింగ్‌కు హాజరవుతారు.
విక్రమ్ మిశ్రీ ఏ రాష్ట్రానికి చెందినవాడు?
అంబాసిడర్ మిస్రి శ్రీనగర్‌లో జన్మించారు మరియు అక్కడ తన ప్రాథమిక విద్యను (బర్న్ హాల్ స్కూల్ మరియు DAV స్కూల్) అలాగే జమ్మూ కాశ్మీర్‌లోని ఉధంపూర్ (కార్మెల్ కాన్వెంట్ స్కూల్)లో పొందారు.
భారతదేశం యొక్క ప్రస్తుత ifs అధికారి ఎవరు?
విక్రమ్ మిస్రీ 35వ మరియు ప్రస్తుత విదేశాంగ కార్యదర్శి. పౌర సేవకులతో కూడిన ఈ సేవకు భారతదేశ విదేశీ సంబంధాలను నిర్వహించడం మరియు కాన్సులర్ సేవలను అందించడం మరియు అంతర్జాతీయ సంస్థలలో భారతదేశం యొక్క ఉనికిని గుర్తించడం అప్పగించబడింది.
Ifs అధికారి విదేశాలలో ఆస్తులు కొనుగోలు చేయవచ్చు?
ఇతర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే IFS అధికారులు కూడా కేంద్ర పౌర సేవల (ప్రవర్తన) నియమాలకు లోబడి ఉంటారు. IFS అధికారి ప్రభుత్వం నుండి అనుమతి పొందిన తర్వాతే విదేశాలలో స్థిరాస్తిని కొనుగోలు చేయవచ్చు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: