हिन्दी | Epaper
ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ రికార్డు స్థాయికి చేరిన పసిడి ధరలు రైలుపై భారీ క్రేన్‌ ఇరాన్లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ రికార్డు స్థాయికి చేరిన పసిడి ధరలు రైలుపై భారీ క్రేన్‌ ఇరాన్లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ రికార్డు స్థాయికి చేరిన పసిడి ధరలు రైలుపై భారీ క్రేన్‌ ఇరాన్లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ రికార్డు స్థాయికి చేరిన పసిడి ధరలు రైలుపై భారీ క్రేన్‌ ఇరాన్లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్

Telugu News: video viral: సముద్రంలో వెనెజువెలా ట్యాంకర్ ను సీజ్ చేసిన  ట్రంప్

Sushmitha
Telugu News: video viral: సముద్రంలో వెనెజువెలా ట్యాంకర్ ను సీజ్ చేసిన  ట్రంప్

video viral వెనెజువెలా విషయంలో అమెరికా (America) అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. వెనెజువెలా అధ్యక్షుడు నికొలస్ మధురోను పదవి నుంచి దిగిపోవాలని ఇప్పటికే హెచ్చరించిన ట్రంప్, ఇటీవల కరీబియన్ సముద్రంలో యుద్ధ నౌకలను మోహరించారు. మధురో డ్రగ్ స్మగ్లర్లకు వంత పాడుతున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఇటీవల పలు డ్రగ్ స్మగ్లింగ్ బోట్లను అమెరికా సైన్యం సముద్రంలోనే పేల్చివేసింది. ఈ క్రమంలో తాజాగా వెనెజువెలా ఆయిల్ ట్యాంకర్ షిప్‌ను అమెరికా సైన్యం సీజ్ చేసింది.

Read Also: America: US Fed వడ్డీ రేట్లు తగ్గింపు.. భారత మార్కెట్లపై ప్రభావం!

video viral
video viral Trump seizes Venezuelan tanker at sea

క్యూబాకు వెళ్తున్న భారీ ఆయిల్ ట్యాంకర్ సీజ్

వెనెజువెలా తీరం నుంచి క్యూబాకు బయలుదేరిన ఈ భారీ షిప్‌ను అమెరికా సైనికులు తమ అధీనంలోకి తీసుకున్నారు. హెలికాప్టర్లో వెళ్లి షిప్‌పై దిగిన సైనికులు, ఆయుధాలతో షిప్ సిబ్బందిని చుట్టుముట్టిన వీడియోను అమెరికా మీడియాకు విడుదల చేసింది. ఈ విషయంపై ట్రంప్ (Trump) మీడియాతో మాట్లాడుతూ, ఇప్పటివరకు సీజ్ చేసిన వాటిలో ఇదే అతిపెద్ద ఆయిల్ ట్యాంకర్ అని చెప్పారు. ఇకముందు కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతాయి, మీరు చూస్తారంటూ వ్యాఖ్యానించారు.

మచాడో అరెస్ట్ బెదిరింపుపై ట్రంప్ స్పందన

ఈ సందర్భంగా వెనెజువెలా ప్రతిపక్ష నేత, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మరియా కొరినా మచాడోపై ఆ దేశ అధ్యక్షుడు మధురో విధించిన ఆంక్షలను మీడియా ట్రంప్ వద్ద ప్రస్తావించింది. ఈ నెల 10న నార్వే రాజధాని ఓస్లోలో నోబెల్ బహుమతి ప్రదానోత్సవానికి మచాడో హాజరైతే ఆమెను అరెస్టు చేస్తామని మధురో హెచ్చరించారు. దీంతో ఆమె ప్రదానోత్సవానికి హాజరు కాలేదు, మచాడో తరఫున ఆమె కూతురు నోబెల్ బహుమతి (Nobel Prize) అందుకున్నారు. అయితే, మచాడో నార్వేకు వెళ్లారని సమాచారం. దీనిపై ట్రంప్ స్పందిస్తూ, మచాడో అరెస్టవుతారని తాను భావించడం లేదని, ఆమె అరెస్టు కావడం తనకు నచ్చదని వ్యాఖ్యానించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870